సాధారణంగా కొందరి జుట్టు చాలా షార్ట్ గా ఉంటుంది.ఇలాంటి వారు తమ హెయిర్ ను పొడుగ్గా పెంచుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.
ఖరీదైన హెయిర్ ఆయిల్స్ ( Hair oils )వాడుతుంటారు.రకరకాల హెయిర్ ప్యాక్స్ ప్రయత్నిస్తూ ఉంటారు.
అయినప్పటికీ రిజల్ట్ అంతంత మాత్రం గానే ఉంటుంది.అయితే జుట్టును పొడుగ్గా పెంచడానికి మరియు షైనీ గా మెరిపించడానికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ టానిక్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను వాడటం అలవాటు చేసుకుంటే అదిరిపోయే రిజల్ట్ మీ సొంతం అవుతుంది.మరి ఇంతకీ ఆ హెయిర్ టానిక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక నాలుగు రెబ్బలు కరివేపాకు( curry leaves ), ఐదు నుంచి ఆరు మందారం పువ్వులు మరియు ఒక చిన్న కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ( onion slices )వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.దాంతో మన హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో తయారు చేసుకున్న హెయిర్ టానిక్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.

గోరువెచ్చగా అయిన తర్వాత స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి టానిక్ ను అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ న్యాచురల్ టానిక్ ను వాడితే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.లాంగ్ అండ్ షైనీ హెయిర్ మీ సొంతం అవుతుంది.అలాగే ఈ టానిక్ ను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
పొడి జుట్టు సమస్య దూరమవుతుంది.మరియు జుట్టు విరగడం, చిట్లడం వంటి సమస్యలు సైతం పరార్ అవుతాయి.