1.మునుగోడులో వంద చెక్ పోస్టుల ఏర్పాటు
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో దాదాపు 100 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
2.కెసిఆర్ పై షర్మిల కామెంట్స్
![Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola](https://telugustop.com/wp-content/uploads/2022/10/sharmila-comments-kcr.jpg )
నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దిట్ట అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
3.కోదండరాం మౌన ప్రదర్శన
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మునుగోడులో జరుగుతున్న అక్రమాలు ఎన్నికల నియమావలి ఉల్లంఘన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.బుద్ధ భవన్ లోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో కోదండరాం మౌన ప్రదర్శనకు దిగారు.
4.ఎం బి ఎస్ జువెల్స్ అధినేత ను కష్టడిలోకి తీసుకున్న ఈడి
![Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola](https://telugustop.com/wp-content/uploads/2022/10/mbs-jewelers.jpg )
ఎంబీఎస్ జూవెల్స్ అధినేత సుఖేష్ గుప్తాను విచారణ నిమిత్తం ఈడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
5.కబడ్డీని ఒలంపిక్స్ లో చేర్చాలి
ప్రపంచవ్యాప్తంగా 42 దేశాలలో ప్రాచుర్యంలో ఉన్న కబాడీ క్రీడను ఒలంపిక్ క్రీడల్లో చేర్చాలని కబాడీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహమ్మద్ అజీజ్ ఖాన్ కోరారు.
6.రేపు కొమరవెల్లి మల్లన్న ఆలయం మూసివేత
![Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola](https://telugustop.com/wp-content/uploads/2022/10/komaravelli-mallanna-temple-1.jpg )
పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ను మూసివేయనున్నారు.
7.తపస్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం జోగులాంబ గద్వాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
8.మునుగోడు లో టిఆర్ఎస్ గెలుస్తుంది : చాడా
![Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola](https://telugustop.com/wp-content/uploads/2022/10/chada-venkat-reddy.jpg )
మునుగోడు ఉప ఎన్నికల లో టిఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.
9.కాంతారా లోని పాట కాపీ అంటూ లీగల్ నోటీసు
ఇటీవల విడుదల సంచలనం సృష్టించిన సినిమా కాంతారా లోని ఓ పాట కాఫీ చేశారంటూ ప్రముఖ సంగీత బృందం థాయి కుడం బ్రిడ్జ్ ‘ ఆరోపణలు చేసింది.
10.తెలుగు రాష్ట్రాల్లో మూతపడిన ప్రధాన ఆలయాలు
![Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola](https://telugustop.com/wp-content/uploads/2022/10/solar-eclipse-1.jpg )
ఈరోజు సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి.
11.ఘనంగా నటి పూర్ణ వివాహం
సినీ హీరోయిన్ పూర్ణ వివాహం దుబాయ్ లో ఘనంగా జరిగింది.యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షనీధ్ అసిఫ్ ఆలీ ని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
12.రేపు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారం
![Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola](https://telugustop.com/wp-content/uploads/2022/10/mallikarjuna-kharge.jpg )
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
13.బంగ్లాదేశ్ లో సిత్రాన్ బీభత్సం
తుఫాను సిత్రాంగ్ మరింత బలపడి బంగ్లాదేశ్ వైపు కదులుతున్నందున పశ్చిమ బెంగాల్ ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
14.ఆర్థిక శాఖపై జగన్ సమీక్ష
![Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola](https://telugustop.com/wp-content/uploads/2022/10/cm-jagan-review-meeting.jpg )
ఏపీ సీఎం జగన్ అధికారిక సమీక్షలకు శ్రీకారం చుట్టారు.ఈరోజు ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
15.నేడు తెరిచి ఉంచనున్న శ్రీకాళహస్తి ఆలయం
నేడు సూర్యగ్రహణం కారణంగా అన్ని ఆలయాలను మూసివేస్తున్న శ్రీ కాళహస్తి ఆలయం ను మాత్రం తెరిచి ఉంచబోతున్నారు.
16.కాబోయే రిటన్ ప్రధానికి భారత ప్రధాని శుభాకాంక్షలు
![Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola](https://telugustop.com/wp-content/uploads/2022/10/rishi-sunak-modi.jpg )
యూకే ప్రధాని పదవిని చేపట్టబోతున్న ఋషి సనత్ కు ఏపీ ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు.
17.ఏపీ రైతు భరోసా కేంద్రాల్లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పలు ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.తాజాగా ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 ఫారెస్ట్ ఉద్యోగాలతో పాటు దాదాపు 12 రకాల నోటిఫికేషన్ విడుదల చేశారు.
18.నిఖిల్ ’18 పేజెస్ ‘ రిలీజ్ డేట్ ఫిక్స్
![Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola](https://telugustop.com/wp-content/uploads/2022/10/nikhil-18-pages.jpg )
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ’18 పేజెస్ ‘ ను డిసెంబర్ 23 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
19.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 862 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
20.ఈరోజు బంగారం ధరలు
![Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola Telugu Actress Poorna, Apcm, Cm Kcr, Corona, Kantara, Pm Modi, Rishi Sunak, Sola](https://telugustop.com/wp-content/uploads/2022/10/today-gold-rates-3.jpg )
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,800 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50, 110
.