కుంభమేళా (kumbh mela)అంటే జనాలు పోటెత్తడం మామూలే.కానీ ఈసారి రైళ్లలో సీట్లు దొరక్క జనం పిచ్చెక్కిపోయారు.
కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణం నరకంగా మారింది.ఇలాంటి టైమ్‌లో ముగ్గురు అమ్మాయిలు (Three girls)చేసిన పని చూస్తే మాత్రం ఎవరికైనా మతి పోవాల్సిందే.
కుంభమేళాకి వెళ్తూ ఈ ముగ్గురమ్మాయిలు ఏకంగా ట్రైన్ టాయిలెట్‌లోనే తిష్ట వేశారు.
వీడియోలో ఒక అమ్మాయి టాయిలెట్ సీటుపై(toilet seat) నిలబడి సెల్ఫీ వీడియో(Selfie video) తీసుకుంటూ కనిపించింది.
తన పక్కనే ఇద్దరు స్నేహితురాళ్లు ఇరుక్కుని కూర్చున్నారు.కెమెరాలో చూస్తూ “మేం ట్రైన్ టాయిలెట్‌లో కుంభమేళాకి వెళ్తున్నాం” అంటూ గర్వంగా చెప్పింది.
బయట జనం తొక్కిసలాటలో చచ్చిపోయేలా ఉన్నారని, అందుకే టాయిలెట్‌లోకి దూరామని సమర్థించుకుంది.అంతేకాదు, డోర్ తెరిస్తే బయట జనం గుంపు చూసి షాక్ అవుతారంటూ స్నేహితురాలితో సరదాగా చెప్పింది.

ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది.లక్షల మంది షాకయ్యారు.“సిగ్గు లేదు.బుద్ధి లేదు” అంటూ జనాలు తిట్టిపోశారు.
టాయిలెట్‌ను ఇలా వాడుకుంటారా? ఇదేనా మీ సంస్కారం? అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు.కొందరైతే ఏకంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ట్యాగ్ చేసి వీళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విమర్శలు వెల్లువెత్తడంతో ఆ అమ్మాయి మళ్లీ స్పందించింది.“మాకు వేరే దారి లేదు.టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాం.అందుకే టీటీఈకి దొరక్కుండా టాయిలెట్‌లోకి వచ్చాం” అంటూ అసలు విషయం బయటపెట్టింది.జనాలు ఎంత తిట్టినా ఏ మాత్రం సిగ్గులేకుండా, వీడియో వైరల్ అవ్వడంపై సంబరపడిపోయింది.

అంతేకాదు, ఆ తర్వాత ఏకంగా ప్రయాగ్‌రాజ్‌లో పుణ్య స్నానాలు చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది.అంటే తప్పు చేసి కూడా ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా, పైగా దాన్ని గొప్పగా చెప్పుకుంటూ తిరుగుతోంది.ఇలాంటి వాళ్ల వల్లే దేశం పరువు పోయేది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.







