సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో మస్త్ వైరల్ అవుతోంది.ఇందులో కొందరు భారతీయులు వియత్నాం అమ్మాయితో సెల్ఫీలు దిగడానికి క్యూ కట్టడం చూస్తే షాక్ అవుతారు.
“వియత్నాం లోకల్ అడ్వెంచర్స్” (Vietnam Local Adventures) అనే ఇన్‌స్టా పేజీ ఈ వీడియోను షేర్ చేయడంతో ఇది ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది.
ఆ వీడియోలో ఒక వియత్నాం అమ్మాయి సంప్రదాయ దుస్తులైన ఆవో దై (Ao Dai) వేసుకొని ఫొటోలకు ఫోజులిస్తోంది.
లూనార్ న్యూ ఇయర్(Lunar New Year) సెలబ్రేషన్స్ సందర్భంగా ఏదో ఫొటోషూట్ జరుగుతున్నట్లు ఉంది.ఆ అమ్మాయి తన కోసం అక్కడ ఫొటోలు దిగుతున్నా, తనతో ఫొటోలు దిగాలని అడిగిన వాళ్లని మాత్రం ఏమీ అనకుండా చాలా మర్యాదగా ఒప్పుకుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం రెండు రకాలుగా స్పందిస్తున్నారు.కొందరు ఇండియన్ మగవాళ్లని (Indian men)బాగా విమర్శిస్తున్నారు.
వాళ్లు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారని, ప్రపంచం ముందు మన దేశ పరువు తీసేశారని మండిపడుతున్నారు.మరికొందరు మాత్రం వాళ్లని వెనకేసుకొస్తున్నారు.
వేరే దేశాల వాళ్లతో ఫొటోలు దిగడం మామూలే కదా, ఇందులో తప్పు ఏముందని అంటున్నారు.

“భారతీయ మగవాళ్లు ఎక్కడికి వెళ్లినా అంతే, దేశ పరువును బజారున పడేస్తారు.” అని ఒక యూజర్ కామెంట్ చేస్తే, ఇంకొకరు మాత్రం “వాళ్లు మర్యాదగా ఉన్నారు, అమ్మాయిని తాకలేదు, లైన్‌లో వెయిట్ చేశారు, థాంక్స్ చెప్పారు.ఇంకా ఎందుకు ద్వేషం?” అని కౌంటర్ ఇచ్చారు.ఇంకొందరు అయితే డబుల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతున్నారు.“ఇదే పని కొరియన్ అబ్బాయిలు చేసి ఉంటే ఎవరూ ఏమీ అనేవాళ్లు కాదు.పైగా వాళ్లతో ఫొటోలు దిగడానికి అందరూ ఎగబడేవాళ్లు” అని కామెంట్ చేశారు.

ఇంకా కొంతమంది అయితే జపాన్ లాంటి దేశాల్లో కూడా ఫారిన్ టూరిస్టులు సంప్రదాయ దుస్తుల్లో ఉన్నవాళ్లతో ఫొటోలు దిగుతారు కదా అని వాదిస్తున్నారు.“ఒక నల్లటి మనిషి, ముఖ్యంగా ఒక భారతీయుడు ఇలా చేస్తేనే అందరికీ తప్పుగా కనిపిస్తుంది.వేరేవాళ్లు చేస్తే ఎవరూ పట్టించుకోరు” అని ఇంకొకరు రాసుకొచ్చారు.
మొత్తానికి ఈ వీడియోపై చర్చ మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది.ఇది సరైన పనేనా, లేక మర్యాదపూర్వకమైన అభిమానమా అనేది తేలాల్సి ఉంది.







