న్యూస్ రౌండప్ టాప్ 20

1.భారత్ లో కరోనా

Telugu Apcm, Bandi Sanjay, Bhajarangdal, Cm Kcr, Corona, Inter Exam, Mla Reddyan

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6,594 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

2.కార్వీ ఏండి పై మరో కేసు నమోదు

  కార్వీ ఎండీ పార్థసారథి పై మరో కేసు నమోదైంది.యాక్సిస్ బ్యాంక్ కు 159 కోట్ల రుణాలు ఎగ్గొట్టినట్టు ఆయనపై  అభియోగాలు ఉన్నాయి. 

3.డోర్నకల్ ఎమ్మెల్యే కు నిరసన సెగ

 

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

Telugu Apcm, Bandi Sanjay, Bhajarangdal, Cm Kcr, Corona, Inter Exam, Mla Reddyan

మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ నిరసన సెగ తగిలింది.నర్సింహులపేట మండలం జయపురంలో పల్లె ప్రగతి కి వచ్చిన ఎమ్మెల్యేలను గ్రామస్తులు అడ్డుకున్నారు .డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. 

4.బిజెపి భారీ బహిరంగ సభ

  జూలై 2, 3, 4 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ నోవోటెల్ లో జరగనున్నాయి. 

5.బిజెపి తెలంగాణ కార్యాలయానికి తరుణ్ చుగ్

 

Telugu Apcm, Bandi Sanjay, Bhajarangdal, Cm Kcr, Corona, Inter Exam, Mla Reddyan

బిజెపి తెలంగాణ కార్యాలయానికి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ వచ్చారు.జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్వహణ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. 

6.బాసర ట్రిపుల్ ఐటి వద్ద బిఎస్పి నేతల ఆందోళన

  నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటి వద్ద బీఎస్పీ నేతలు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. 

7.ఉద్యోగులను ఉద్దేశించి జగన్ కామెంట్స్

 

Telugu Apcm, Bandi Sanjay, Bhajarangdal, Cm Kcr, Corona, Inter Exam, Mla Reddyan

ఉద్యోగులను తాము కలుపుకుని వెళ్తుంటే వారిని రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని, ఉద్యోగులకు ప్రతి ఒకటి మంచి చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. 

8.జగన్ పై లోకేష్ కామెంట్స్

  జగన్ మోసపు రెడ్డి చేసిన ప్రతి మోసాన్ని బయటపెడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్యంగా విమర్శించారు. 

9.జూన్ 25 నుంచి దేవినేని పాదయాత్ర

 

Telugu Apcm, Bandi Sanjay, Bhajarangdal, Cm Kcr, Corona, Inter Exam, Mla Reddyan

ఏపీ లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని ప్రభుత్వం వెంటనే రోడ్లు బాగు చేయాలని మాజీ మంత్రి , టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమ ఈనెల 25 నుంచి పాదయాత్ర నిర్వహించనున్నారు. 

10.బజరంగ్దళ్ దేశవ్యాప్త నిరసనలు

  మహమ్మద్ ప్రవక్త పై బిజెపి బహిష్కృత నేత నూపూర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడాన్ని విశ్వహిందూ పరిషత్ ఖండించింది దీనికి నిరసనగా బజరంగ్దల్ దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. 

11.రెండోరోజు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ

 

Telugu Apcm, Bandi Sanjay, Bhajarangdal, Cm Kcr, Corona, Inter Exam, Mla Reddyan

నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం రెండోరోజు ప్రశ్నించింది. 

12.నేను రాష్ట్రపతి రేసులో లేను : శరద్ పవార్

  తాను రాష్ట్రపతి రేసులో లేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ క్లారిటీ ఇచ్చారు. 

13.బండి సంజయ్ కు పోలీసుల నోటిసులు

 

Telugu Apcm, Bandi Sanjay, Bhajarangdal, Cm Kcr, Corona, Inter Exam, Mla Reddyan

సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను కించపరచినందుకు బీజేపీ నేతలు రాణిరుద్రమ లను పోలీసులు అరెస్టు చేశారు.అలాగే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు హయత్ నగర్ పోలీసులు నోటీసు జారీ చేశారు. 

14.బిజెపి క్షమాపణలు చెప్పాలి .కాంగ్రెస్ డిమాండ్

  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకుని తక్షణమే బిజెపి క్షమాపణలు చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. 

15.పవన్ కళ్యాణ్ పై జగన్ విమర్శలు

 

Telugu Apcm, Bandi Sanjay, Bhajarangdal, Cm Kcr, Corona, Inter Exam, Mla Reddyan

దత్తపుత్రుడు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పరోక్షంగా ఏపీ సీఎం జగన్ విమర్శలు చేశారు.చంద్రబాబు కోసం దత్తపుత్రుడు ఏం చేసేందుకైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఆయన విమర్శించారు. 

16.రేపు ఇంటర్ ఫలితాలు

  తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రేపు విడుదల చేయనున్నారు. 

17.మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు

 

Telugu Apcm, Bandi Sanjay, Bhajarangdal, Cm Kcr, Corona, Inter Exam, Mla Reddyan

మరో ఈ రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

18.సమతా మూర్తి ప్రవేశ రుసుం భారీగా పెంపు

  ముచ్చింతల్ లో శ్రీ రామానుజాచార్యుల ఏర్పాటుచేసిన సమతా మూర్తి విగ్రహం సందర్శన రుసుము పెంచారు.ప్రస్తుతం పెద్దలకు 150,  చిన్నారులకు 75 ఉండగా, దానిని 200, 125 గా పెంచారు. 

19.తెలంగాణలో 5,083 పోస్టులు.త్వరలోనే ప్రకటన

  తెలంగాణలో మరో 5,083 పోస్టులకు ప్రకటన వెలువడనుంది.ఈ మేరకు ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందించారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

 

Telugu Apcm, Bandi Sanjay, Bhajarangdal, Cm Kcr, Corona, Inter Exam, Mla Reddyan

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,400
  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,710

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube