అల్లు అరవింద్( Allu Aravind ) ప్రస్తుతం తండేల్ ( Thandel )సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇలా ఈ సినిమా విడుదలవుతున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా నిర్వహించారు ఇందులో భాగంగా అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అప్పటివరకు వరుసహిత సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన పవన్ కళ్యాణ్ మొదటిసారి డైరెక్టర్ గా మారి జానీ( Johnny ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాపై ప్రేక్షకులలో పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను ఆకట్టుకోలేకపోయింది.ఇక ఈ సినిమాకు అల్లు అర్జున్ నిర్మాతగా వ్యవహరించారు అయితే ఈ సినిమా సక్సెస్ కాకపోవడం గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.జానీ సినిమా గురించి ఇప్పుడు తలుచుకున్న నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందని తెలిపారు.
ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉండేవి.అయితే ఒకసారి షూటింగ్ చేస్తున్న సమయంలో నేను పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ ఈ సినిమా ఎక్కడో తేడా కొడుతుంది అంటూ మాట్లాడాను.

ఆరోజు ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందనేది స్పష్టమైనది.ఈ సినిమా పోతుందని ముందే తెలుసు అప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసాము.అనుకున్న విధంగానే ఈ సినిమా పోయిందని అల్లు అరవింద్ తెలిపారు.అయితే ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయని వెల్లడించారు.విడుదలకు ముందు ఆడియో క్యాసెట్స్ అమ్మకాలు, సాటిలైట్ రైట్స్ అన్నీ రికార్డ్స్ అంటూ చెప్పుకొచ్చాడు.ఇలా జానీ సినిమా గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.