నాగచైతన్య( Naga Chaitanya ) సాయి పల్లవి( Sai Pallavi ) హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం తండేల్( Thandel ).ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం ఎంతో సతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొని ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఎంతో సతోషం వ్యక్తం చేశారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.ఉదయం నుంచి ఒక్కటే ఫోన్స్ మెసేజెస్ వస్తున్నాయని చాలా ఆనందంగా ఉంది.ఇంత పాజిటివిటీ చూసి ఎంతో కాలమైంది.నేను మిస్ అయింది మళ్లీ తిరిగొచ్చింది.
మార్నింగ్ నుంచి హిట్ టాక్‌తో( Hit Talk ) సినిమా ప్రదర్శితమవుతోంది.

ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఎక్కువ మంది థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని కోరారు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే ఎన్నో విషయాలు ఈ సినిమాలో ఉన్నాయని నాగచైతన్య తెలిపారు.వాళ్లు చూస్తే ఈ సినిమాకి మరింత మంచి పేరు వస్తుందని నమ్ముతున్నా.నా నటనకు వచ్చే ప్రశంసల్లో సగం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కే( Devisri Prasad ) దక్కుతాయి.
ఈ సినిమా కోసం అద్భుతమైన సంగీతం అందించారు.ముఖ్యంగా బుజ్జి తల్లి పాటకు మరో వెర్షన్ ఇవ్వడం వల్ల క్లైమాక్స్ మరో స్థాయికి వెళ్లింది.
నన్ను నమ్మి ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ నాగచైతన్య ఈ సినిమా సక్సెస్ కావడంతో తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.







