సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ అందరికీ ఇవ్వాలి... దేవిశ్రీప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు దేవిశ్రీప్రసాద్( Devi Sri Prasad ) ఒకరు.ఈయన ఇటీవల పుష్ప2( Pushpa 2 ) సినిమాతో పాటు నాగచైతన్య( Nagachaitanya ) నటించిన తండేల్( Thandel ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నారు.

 Devi Sri Prasad Indirectly Satires On Pushpa Makers And Hero Details, Devi Sri P-TeluguStop.com

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృంధం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో పాటలు కూడా ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ స్పందించారు.

Telugu Allu Arjun, Devi Sri Prasad, Musicdevi, Nagachaitanya, Pushpa, Sukumar, T

ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు.ఈ సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగంగా దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.ఈ సినిమా చూసిన చాలామంది సాంగ్స్, బీజియం స్కోర్ బాగుందంటూ మెసేజెస్ చేస్తూ అభినందిస్తున్నారని, చాలసంతోషంగా ఉందని అన్నాడు.

ఇక ఈ చిత్రం కోసం అందరూ సమిష్టిగా కలసి పని చెయ్యడంవల్లే మంచి రిజల్ట్ వచ్చిందని అలాగే సినిమా సక్సెస్ అయితే ఆ సినిమా క్రెడిట్ మొత్తం చిత్ర బృందం అందరికీ ఇవ్వాలి కానీ ఒక్కరికే ఆ క్రెడిట్ సొంతం చేయకూడదని ఈయన తెలిపారు.

Telugu Allu Arjun, Devi Sri Prasad, Musicdevi, Nagachaitanya, Pushpa, Sukumar, T

ఇలా సినిమా సక్సెస్ కోసం ఎంతోమంది కష్టపడాల్సి ఉంటుంది ఇలా అందరూ సమిష్టిగా కష్టపడి పనిచేసినప్పుడే సినిమా మంచి సక్సెస్ అవుతుంది అలాంటప్పుడు క్రెడిట్ కూడా అందరికీ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.అయితే దేవిశ్రీప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు కొందరిని ఉద్దేశించే చేశారని తెలుస్తుంది పుష్ప2 విషయంలో దేవిశ్రీప్రసాద్ దర్శకుడి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి, ఈ సినిమా కారణంగా అల్లు అర్జున్( Allu Arjun ) వివాదంలో చిక్కుకున్న సమయంలో దేవిశ్రీప్రసాద్ స్పందించిన దాఖలాలు కూడా లేవు అంతేకాకుండా పుష్ప 2 మంచి సక్సెస్ అయినప్పటికీ క్రెడిట్ మొత్తం హీరోకి మాత్రమే ఇవ్వటంతోనే ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube