సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ అందరికీ ఇవ్వాలి… దేవిశ్రీప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు దేవిశ్రీప్రసాద్( Devi Sri Prasad ) ఒకరు.

ఈయన ఇటీవల పుష్ప2( Pushpa 2 ) సినిమాతో పాటు నాగచైతన్య( Nagachaitanya ) నటించిన తండేల్( Thandel ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నారు.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృంధం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో పాటలు కూడా ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ స్పందించారు.

"""/" / ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు.

ఈ సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగంగా దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.ఈ సినిమా చూసిన చాలామంది సాంగ్స్, బీజియం స్కోర్ బాగుందంటూ మెసేజెస్ చేస్తూ అభినందిస్తున్నారని, చాలసంతోషంగా ఉందని అన్నాడు.

ఇక ఈ చిత్రం కోసం అందరూ సమిష్టిగా కలసి పని చెయ్యడంవల్లే మంచి రిజల్ట్ వచ్చిందని అలాగే సినిమా సక్సెస్ అయితే ఆ సినిమా క్రెడిట్ మొత్తం చిత్ర బృందం అందరికీ ఇవ్వాలి కానీ ఒక్కరికే ఆ క్రెడిట్ సొంతం చేయకూడదని ఈయన తెలిపారు.

"""/" / ఇలా సినిమా సక్సెస్ కోసం ఎంతోమంది కష్టపడాల్సి ఉంటుంది ఇలా అందరూ సమిష్టిగా కష్టపడి పనిచేసినప్పుడే సినిమా మంచి సక్సెస్ అవుతుంది అలాంటప్పుడు క్రెడిట్ కూడా అందరికీ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.

అయితే దేవిశ్రీప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు కొందరిని ఉద్దేశించే చేశారని తెలుస్తుంది పుష్ప2 విషయంలో దేవిశ్రీప్రసాద్ దర్శకుడి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి, ఈ సినిమా కారణంగా అల్లు అర్జున్( Allu Arjun ) వివాదంలో చిక్కుకున్న సమయంలో దేవిశ్రీప్రసాద్ స్పందించిన దాఖలాలు కూడా లేవు అంతేకాకుండా పుష్ప 2 మంచి సక్సెస్ అయినప్పటికీ క్రెడిట్ మొత్తం హీరోకి మాత్రమే ఇవ్వటంతోనే ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.