టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో తమన్( Thaman ) ఒకరు.ప్రస్తుతం ఈయన చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
తాజాగా ఈయన బాలకృష్ణ( Balakrishna ) డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమా ద్వార ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక తమన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారని చెప్పాలి.మాస్ సినిమాలకు ఈయన ఇచ్చే బిజిఎంతో థియేటర్లు దద్దరిల్లిపోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా సంగీత దర్శకుడిగా తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన గురించి ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు.తన సినీ జీవితంలో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని తెలిపారు.తాను కొంతమందిని నమ్మి దారుణంగా మోసపోయానని తమన్ బయటపెట్టారు.మన జీవితంలో ఏదో ఒక సమయంలో మనం కొంతమంది వ్యక్తులను నమ్మి గుడ్డిగా మోసపోతాము.నాకు కూడా అలాగే జరిగింది నేను కూడా కొంతమంది చేతుల్లో మోసపోయానని తెలిపారు.నేను ఎంతో గుడ్డిగా నమ్మిన వారే నాకు వెన్నుపోటు పొడిచారని తమన్ తెలిపారు.

నా ముందు నా గురించి చాలా మంచిగా మాట్లాడుతూ పక్కకు వెళ్ళగానే అదే వ్యక్తి ఎంతో చెడ్డగా ఇతరులతో చెప్పేవారు.అంతే కాదు కొందరిని నమ్మి చాలా డబ్బు కూడా పోగొట్టుకున్నాను.నా జీవితంలో ఎదురైనా ఒడిదుడుకులతో నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను అని అన్నారు .ఇక తన అలవాట్లు గురించి కూడా మాట్లాడుతూ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఏదైనా పని ఒత్తిడికి గురి అయినప్పుడు తప్పకుండా వెళ్లి క్రికెట్( Cricket ) ఆడే వాడినని తమన్ వెల్లడించారు.తాను ఎప్పుడు కూడా సెలబ్రిటీల గ్రౌండ్ లో క్రికెట్ ఆడాలని కోరుకునేవాడిని కానీ అప్పట్లో ఆ కోరిక తీరలేదు కానీ ఇప్పుడు మాత్రం సెలబ్రెటీ క్రికెట్ లీగ్( Celebrity Cricket League ) పుణ్యమా అని ఆ బాధ తగ్గిందని తెలిపారు
.






