సినీ నటుడు నాగచైతన్య( Nagachaitanya ) సాయి పల్లవి( Sai Pallavi ) జంటగా నటించిన చిత్రం తండేల్( Thandel ).ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి టాక్ సొంతం చేసుకుంది.
నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య ఒక జాలరి పాత్రలో నటించారు.ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా నిర్వహించారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయి పల్లవి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది ఇందులో భాగంగా నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు నాగచైతన్య సమాధానం చెప్పారు.

ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇందులో భాగంగా ఒక నెటిజన్ ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాకు ఎందుకు అంతగా ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ ప్రతి ఒక్క నటుడు కూడా తమ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటారు.
నాకు సక్సెస్ వచ్చే రెండు సంవత్సరాలు అయింది చాలా ఆకలి మీద ఉన్నాను.అందుకే ఈ సినిమా సక్సెస్ కోసమే ఇలా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

ఇకపోతే మరొక నేటిజన్ అన్న మీరు యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటారు అంటూ నాగచైతన్య నటన గురించి ఆయన యాక్టింగ్ స్కిల్స్ గురించి కాస్త హేళన చేస్తూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటారా ఏంటి? నిజానికి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్.నిరంతరం నేర్చుకోవాల్సి ఉంటుంది.ఈ ప్రాసెస్ కి ఫుల్ స్టాప్ పెట్టొద్దు.ఒకవేళ ఫుల్ స్టాప్ పెడితే గనక నటుడుగా ఎదగడానికి పులి స్టాప్ పెట్టినట్లే, ఫ్యూచర్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు.నేను ఇంకా నేర్చుకోలేదు.
ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను అంటూ తనదైన శైలిలోనే నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.