Hair Breakage : జుట్టు విపరీతంగా ముక్కలవుతుందా.. ఈ హెయిర్ టానిక్ తో ఈజీగా చెక్ పెట్టేయండి!

జుట్టు ముక్కలు అవ్వడం.( Hair Breakage ) ఈ సమస్యతో సతమతం అవుతున్న వారు మనలో చాలా మంది ఉన్నారు.

 This Homemade Tonic Helps To Get Rid Of Hair Breakage-TeluguStop.com

సరైన పోషణ అందకపోవడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది.దీంతో చీటికిమాటికి జుట్టు ముక్కలు అయిపోతూ ఉంటుంది.

ఈ సమస్య కారణంగా జుట్టును దువ్వాలంటేనే భయపడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ టానిక్ ను( Home Made Hair Tonic ) మీరు కచ్చితంగా వాడాల్సిందే.ఈ టానిక్ హెయిర్ డ్యామేజ్ ను అరికడుతుంది.

జుట్టు మూలాల నుంచి బలోపేతం చేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కలబంద ఆకు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను( Aloevera Gel ) సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో ఆ కలబంద జెల్ ను వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆవనూనె,( Mustard Oil ) వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ) మరియు నాలుగు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.

Telugu Aloe Vera Gel, Oil, Breakage, Care, Care Tips, Fall, Tonic, Healthy, Home

ఈ టానిక్ ను ఒక బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి.ఆపై కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు స్కాల్ప్ ను( Scalp ) మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ టానిక్ ను వాడారంటే అనేక బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

Telugu Aloe Vera Gel, Oil, Breakage, Care, Care Tips, Fall, Tonic, Healthy, Home

మూలాల నుంచి జుట్టును బలోపేతం చేయడానికి ఈ హెయిర్ టానిక్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ టానిక్ ను వాడటం వల్ల బలహీనమైన కురులు బలంగా మారతాయి.దాంతో జుట్టు ముక్కలవడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.కాబట్టి త‌మ జుట్టు విపరీతంగా ముక్కలు అవుతుంది అని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హెయిర్ టానిక్ ను వాడండి.

పైగా ఈ టానిక్ ను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.చుండ్రు సమస్య సైతం దూరం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube