Hair Breakage : జుట్టు విపరీతంగా ముక్కలవుతుందా.. ఈ హెయిర్ టానిక్ తో ఈజీగా చెక్ పెట్టేయండి!

జుట్టు ముక్కలు అవ్వడం.( Hair Breakage ) ఈ సమస్యతో సతమతం అవుతున్న వారు మనలో చాలా మంది ఉన్నారు.

సరైన పోషణ అందకపోవడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది.దీంతో చీటికిమాటికి జుట్టు ముక్కలు అయిపోతూ ఉంటుంది.

ఈ సమస్య కారణంగా జుట్టును దువ్వాలంటేనే భయపడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ టానిక్ ను( Home Made Hair Tonic ) మీరు కచ్చితంగా వాడాల్సిందే.

ఈ టానిక్ హెయిర్ డ్యామేజ్ ను అరికడుతుంది.జుట్టు మూలాల నుంచి బలోపేతం చేస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కలబంద ఆకు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను( Aloevera Gel ) సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ లో ఆ కలబంద జెల్ ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆవనూనె,( Mustard Oil ) వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ) మరియు నాలుగు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా మన హెయిర్ టానిక్ రెడీ అవుతుంది. """/" / ఈ టానిక్ ను ఒక బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి.

ఆపై కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు స్కాల్ప్ ను( Scalp ) మసాజ్ చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ టానిక్ ను వాడారంటే అనేక బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

"""/" / మూలాల నుంచి జుట్టును బలోపేతం చేయడానికి ఈ హెయిర్ టానిక్ అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ టానిక్ ను వాడటం వల్ల బలహీనమైన కురులు బలంగా మారతాయి.దాంతో జుట్టు ముక్కలవడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.

కాబట్టి త‌మ జుట్టు విపరీతంగా ముక్కలు అవుతుంది అని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హెయిర్ టానిక్ ను వాడండి.

పైగా ఈ టానిక్ ను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

చుండ్రు సమస్య సైతం దూరం అవుతుంది.

పాకిస్థానీకి చుక్కలు చూపించిన ఇండియన్.. వీడియో చూస్తే ఫిదా అవుతారు!