Viral Video : వీడియో: మద్యం తాగి బార్ ముందు పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు..!

సాధారణంగా ఒకప్పుడు మహిళలు మందు సిగరెట్ అంటే అసహ్యించుకునేవారు.ముఖ్యంగా భారతదేశంలో వాటి జోలికి ఎవరు వెళ్లేవారు కాదు కానీ సిటీలో లైఫ్ లీడ్ చేసే కొందరు మహిళలు ఆల్కహాల్( Alcohol ) సిగరెట్లకు అలవాటు పడుతున్నారు అంతేకాదు బార్లకు క్లబ్బులకు వెళ్తూ మగవాళ్ళకి తామేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు.

 Two Drunken Women Fight And Abuse Each Other Viral Video-TeluguStop.com

కొన్ని సందర్భాలలో రౌడీల్లాగా కొట్టుకుంటూ మిగతా ప్రజలను షాక్‌కి గురి చేస్తున్నారు.తాజాగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నోలోని ఓ బార్ బయట మద్యం మత్తులో ఇద్దరు మహిళలు( Two Women ) గొడవకు దిగిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఈ వీడియో ఫిబ్రవరి 15న సోషల్ మీడియా( Social Media )లో పోస్ట్ చేశారు.అప్పటినుంచి సోషల్ మీడియాను ఇది ఊపేస్తోంది.లక్నోలోని ఫీనిక్స్ పలాసియో మాల్‌లో ఇద్దరు మహిళలు పార్టీ జాయిన్ అయినట్లు వీడియో చూపిస్తుంది.అర్థరాత్రి పార్టీ నిర్వహించడంతో అక్కడున్న వారు బాగా మద్యం సేవించారు.ఇద్దరు మహిళలు కూడా బాగా మద్యం తాగి పార్టీలో తీవ్ర వాగ్వాదానికి( Fighting ) దిగారు, ఆపై భవనంలోని లాబీకి వెళ్లారు.అక్కడ ఒకరినొకరు కొట్టుకోవడం, అరవడం మొదలుపెట్టారు.

ఓ వ్యక్తి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు వినలేదు.ఈ గొడవను కొందరు సెక్యూరిటీ గార్డులు చూశారు కానీ వారిని ఆపేందుకు అస్సలు ప్రయత్నించలేదు.ఈ గొడవ చాలా సేపు సాగి మాల్‌లో తీవ్ర డ్రామా సృష్టించింది.ఇద్దరు మహిళలు ఎందుకు గొడవ పడ్డారో తెలియ రాలేదు.

కాసేపటికి గొడవ ముగిసింది.ఎక్సైజ్, అన్సల్ పోలీసు శాఖల సహాయంతో ఈ పార్టీని నిర్వహించినట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

పలాసియోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ ఈ కేసును విచారిస్తోంది.అయితే ఇప్పటి వరకు పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన చాలా మంది దిగ్భ్రాంతికి గురయ్యారు.కామెంట్స్ విభాగంలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.యూపీ పోలీసులు( UP Police ), డీజీపీ మహిళలపై కఠిన చర్యలు తీసుకుంటారని తాము ఆశిస్తున్నామని ఓ వ్యక్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేశారు.ఇది మనకు కొత్తేం కాదు అని, మీడియాలో, పార్లమెంటులో ఇలాంటివి జరిగినా ఆశ్చర్యం లేదని మరో వ్యక్తి అన్నారు.

వాలెంటైన్స్ డేని ప్రజలు ఇలా జరుపుకున్నారా అంటూ ఒకరు చమత్కరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube