ఈరోజు రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ( Sankrathiki vastunnnam )సినిమాతో వెంకటేష్ భారీ సక్సెస్ ని అందుకున్నాడనే చెప్పాలి.గత సంక్రాంతికి వచ్చిన సైంధవ్ సినిమా( Saindhav movie ) ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో వెంకటేష్ కెరీర్ అనేది చాలా వరకు గాడి తప్పిందని చాలామంది అనుకున్నారు.
కానీ ఈ సంక్రాంతికి మాత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడనే చెప్పాలి.
మరి వెంకటేష్ ( Venkatesh )లాంటి సీనియర్ హీరో ఇప్పటికి మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ యంగ్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి ( Anil Ravipudi )లాంటి దర్శకుడిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందే ఎఫ్2, ఎఫ్3 అనే సినిమాలు వచ్చాయి.ఇక ఇప్పుడు వచ్చిన ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాలను అందుకోవడమే కాకుండా ఈ సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచారనే చెప్పాలి… ఇక ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా వెంకటేష్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా ఈ సినిమా నిలిచిపోయింది అంటూ మరి కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండడం విశేషం.
ఇక వెంకటేష్ సాధించిన విజయాలు ఒకతైతే ఇక మీదట నుంచి చేయబోయే సినిమాలతో వరుస విజయాలను అందుకొని తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాలో అతని నట విశ్వరూపాన్ని చూపించాడు…ఇక దర్శకుడు అనిల్ రావిపూడి కూడా వరుసగా ఎనిమిదో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకొని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడనే చెప్పాలి…
.