పాకిస్థానీకి చుక్కలు చూపించిన ఇండియన్.. వీడియో చూస్తే ఫిదా అవుతారు!

ఇంటర్నెట్‌లో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.స్కామ్ కాల్‌కు( Scam Call ) ఓ భారతీయుడు ఇచ్చిన అదిరిపోయే రిప్లై అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతోంది.

 Indian Man Outsmarts Scammer From Pakistan Video Viral Details, Scam Call, India-TeluguStop.com

శివ్ అరోరా( Shiv Arora ) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్, తనను మోసం చేయబోయిన పాకిస్థానీకి( Pakistan ) ఎలా బుద్ధి చెప్పాడో వీడియో ద్వారా పంచుకున్నాడు.దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.

అసలు ఏం జరిగిందంటే, శివ్ అరోరాకు ఓ వాట్సాప్ కాల్( WhatsApp Call ) వచ్చింది.అది పాకిస్థాన్ నంబర్ నుంచి వచ్చింది.కాల్ చేసిన వ్యక్తి ప్రొఫైల్ పిక్చర్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఫోటో పెట్టుకుని, తానే పోలీస్ ఆఫీసర్‌నని నమ్మబలికాడు.అంతేకాదు, అరోరా కుటుంబ సభ్యుల్లో ఒకరిని అరెస్ట్ చేశామని, వారిని విడిపించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.స్కామర్ అరోరాను “నీ కొడుకు పేరు చెప్పు, వాడితో మాట్లాడిస్తాను” అన్నాడు.అది స్కామ్ అని తెలుసుకున్న శివ్, వాడితో సరదాగా ఆడుకోవాలని ఫిక్సయ్యాడు.వెంటనే తన కొడుకు పేరు “శివ్” అని చెప్పి, వాడు మొరాదాబాద్‌లో ఉన్నాడని ఆందోళనగా చెప్పాడు శివ్.

ఇక స్కామర్, ఆ అబ్బాయికి నువ్వేమవుతావని అడిగితే, శివ్ నవ్వుతూ “నానమ్మ” అని చెప్పడంతో స్కామరే షాక్ అయ్యాడు.

ఇంకేముంది, స్కామర్ ఎలాగైనా డబ్బులు గుంజాలని ప్లాన్ చేశాడు.ఆ తర్వాత ఆ అబ్బాయి తల్లితో మాట్లాడతానని అడిగాడు.శివ్ వెంటనే ఒక మహిళను రంగంలోకి దించి, పోలీసులు “శివ్”ను అరెస్ట్ చేశారని చెప్పాడు.

ఆ తర్వాత స్కామర్ మరో వ్యక్తిని రంగంలోకి దించి, అరెస్ట్ అయిన కొడుకులా యాక్టింగ్ చేయమన్నాడు.కానీ, ఆ దొంగ “అమ్మా అమ్మా” అంటూ అరిచే తీరు చూస్తే ఎవరికైనా నవ్వాగదు.

అది చూసి శివ్ గట్టిగా నవ్వడంతో స్కామర్ మైండ్ బ్లాక్ అయిపోయింది.అంతే ఫోన్ పెట్టేశాడు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన శివ్, ఇలాంటి మోసాల పట్ల అందరినీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు.అంతేకాదు, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దని, తెలియని వ్యక్తులకు డబ్బులు పంపించవద్దని, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.శివ్ తెలివితేటలను మెచ్చుకుంటూ, స్కామర్ల పని పట్టాడని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube