భారత సంతతికి చెందిన సింగపూర్ అధ్యక్షుడు థర్మర్ షణ్ముగ రత్నం( Thermar Shanmuga Gemstone ) ఐదు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం భారత్‌కు రానున్నారు.దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షణ్ముగరత్నం భారతదేశ పర్యటనకు రావడం ఇదే తొలిసారి.
ఆయన వెంట ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది.జనవరి 16న సింగపూర్ అధ్మక్షుడికి .రాష్ట్రపతి భవన్‌లో అధికారిక స్వాగతం పలుకుతారు.అనంతరం ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చర్చలు జరుపుతారు.
అలాగే ప్రధాని నరేంద్ర మోడీ,( Prime Minister Narendra Modi ) విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తోనూ( Minister S Jaishankar ) సమావేశం అవుతారు.భారత పర్యటనలో భాగంగా జనవరి 17 నుంచి 18 వరకు ఆయన ఒడిశాలో పర్యటించనున్నారు.
కాగా.2023లో జరిగిన ఎన్నికల్లో షణ్ముగ రత్నం విజయం సాధించిన సంగతి తెలిసిందే.సింగపూర్ 9వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.అధ్యక్ష ఎన్నికల్లో షణ్ముగరత్నంతో పాటు ఎన్‌జీ కోక్ సాంగ్, కిన్ లియాన్‌లు( Ng Kok Sang, Kin Lian ) భారీలో నిలిచారు.ఎన్నికల్లో సాంగ్‌కు 15.72 శాతం , లియాన్‌కు 13.88 శాతం ఓట్లు రాగా.షణ్ముగరత్నానికి 70.40 శాతం ఓట్లు రావడం విశేషం.
షణ్ముగరత్నం తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు.1960ల నుంచి సింగపూర్‌ను పాలిస్తున్న పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ)కి తాను రాజీనామా చేస్తున్నానని, రాజకీయాలతో పాటు ప్రభుత్వంలో వున్న అన్ని పదవుల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (మాస్), జీఐసీ డిప్యూటీ ఛైర్మన్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఇంటర్నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్, మంత్రి తదితర హోదాల్లో షణ్ముగం పనిచేశారు.
ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన థర్మన్ షణ్ముగం.గతంలో సెంట్రల్ బ్యాంక్, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్‌లలో పలు హోదాలలో సేవలందించారు.తొలిసారిగా 2001లో జురాంగ్ జీఆర్‌సీ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.సింగపూర్‌లో చైనీస్ సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఏరియాల్లో ఈ ప్రాంతం కూడా ఒకటి.దేశ ఉప ప్రధానిగా, ఆర్ధిక, విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన థర్మన్.2019 మే నుంచి సీనియర్ మంత్రిగా పదోన్నతి పొందారు.అలాగే సోషియల్ పాలసీలకు కో ఆర్టినేషన్ మినిస్టర్‌గా, ఆర్ధిక విధానాలపై ప్రధానికి సలహాదారుగా కూడా వ్యవహరించారు.