క్రేజీ.. సంక్రాంతికి ఊరెళ్తూ ఇంటి తలుపుపై ఏమి రాసి వెళ్లారంటే?

సంక్రాంతి పండగ ( Sankranti festival )సమయం కావడంతో పని చేసే ఊర్ల నుండి సొంత ఊర్లకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది.ఈ సమయంలో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, పండగ సమయానికే దొంగలు కొంతమంది రెచ్చిపోతుంటారు.

 What Was Written On The Door Of The Crazy Sankranti, Sankranti, Theft, Warning N-TeluguStop.com

ఇదే సందర్భాన్ని వాడుకుంటూ ఓ ఇంటి యజమాని కాస్త వినోదంగా, సరదాగా చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telugu Andhra Pradesh, Cc Cameras, Festive Season, Sankranti, Security, Telangan

ఓ ఇంటి వ్యక్తి ఒక పేపర్‌పై “మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం.డబ్బు, నగలూ తీసుకుని వెళ్తున్నాం.మా ఇంటికి రాకండి.

ఇట్లు మీ శ్రేయోభిలాషి” అని రాసి, తమ ఇంటి వద్ద రాకుండా ఉండండి అని చెప్పారు.అలా రాసిన దాన్ని డోర్‌పై అంటించి వెళ్లిపోయారు.

ఈ సందేశం చూస్తూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అందరూ సమాజంలో పండగకాలం నడుమ సొంత ఊర్లకు వెళ్ళిపోతుంటారు.

దొంగలు ఈ సమయంలో అధికంగా పనిచేస్తారని గుర్తించి ఇలాంటివి చేసేవారికి చిన్న వార్నింగ్ గా ఈయన ఈ సందేశం పెట్టారని భావిస్తున్నారు.

Telugu Andhra Pradesh, Cc Cameras, Festive Season, Sankranti, Security, Telangan

సోషల్ మీడియాలో ( social media )ప్రస్తుతం ఈ లెటర్ ఫోటో వైరల్ అవుతుంది.అయితే ఈ పోస్టర్ ఎక్కడ అంటించారన్న విషయం మాత్రం తెలియరాలేదు.ఇకపోతే పండుగల సమయాల్లో ఊర్లకు వెళ్లే ప్రజలకు ఎప్పటికప్పుడు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.

ఎవరైనా ఇలా వెళ్తున్న సమయంలో పోలీసులకు సమాచారం ఇస్తే ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, రక్షణ కల్పిస్తామని చెప్పిన ప్రజలు ఈ విషయంలో మాత్రం ముందడుగు వేయలేకపోతున్నారు.కాబట్టి ఇకనైనా ఇలాంటి ప్నములు కాకుండా పోలీసులకు చెప్పి బయటికి వెళ్లడం మంచింది.

ఇకపోతే, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను పెద్దెత్తున ఆనందోత్సవాలతో జరుపుకుంటుంన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube