మచ్చలు లేని మెరిసే చర్మం.. మీ సొంతం అవ్వాలంటే ఇలా చేయండి..!

సొంపు ( Anise )వంటకాల రుచిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది.ఇందులో ఉండే గుణాలు వంటకాల రుచులను ఎంతో పెంచడానికి ఉపయోగపడుతుంది.

 Blemish Free Glowing Skin Do This To Get Yours ,glowing Skin ,blemish Free Glow-TeluguStop.com

అయితే ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే దీనిని ఫేస్ ప్యాక్( face pack ) ల వినియోగిస్తే చాలా రకాల ప్రయోజనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఫేస్ ప్యాక్ ముఖం పై నల్లని మచ్చలు,మొటిమలు, పిగ్మెంటేషన్‌లను తొలగించడానికి ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే చర్మాన్ని మెరిపించడం లో కీలక పాత్ర పోషిస్తుంది.కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ ను వినియోగించడం ఇంకా ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఫేస్ ప్యాక్ తయారీకి అవసరమైన పదార్థాలు.ఒక టీ స్పూన్ సొంపు పొడి, ఒక టీ స్పూన్ పెరుగు( curd ) ఉంటే చాలు.సొంపు ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందు గా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ సొంపు పౌడర్.

ఒకటి లేదా రెండు టీ స్పూన్ల పెరుగు వేసుకోవాలి.తర్వాత రెండిటిని బాగా కలిపి ఒక మిశ్రమం గా తయారు చేసుకోవాలి.అంతే సులభంగా సొంపు ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది.

ఈ ఫేస్ ప్యాక్ ను వినియోగించడానికి ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.తర్వాత ముఖం,మెడ పై బాగా అప్లై చేయాలి.ముఖానికి అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి.

ఆ తర్వాత మంచి నీటి తో కడిగి శుభ్రం చేసుకోవడం మంచిది.ఇలా క్రమం తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ఉపయోగించడం వల్ల మచ్చలు లేని, మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube