చిత్ర పరిశ్రమకు ఎన్నో అరుదైన పురస్కారాలను అందిస్తూ ఉంటారు.అయితే అన్నింటికన్నా ఆస్కార్(Oscar) అవార్డును ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తారు.
ఇలా ప్రతి ఏడాది ఈ అవార్డు వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు.ఇకపోతే ఈ ఏడాది మాత్రం ఆస్కార్ వేడుకలలో మన తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించుకుంది.
ఇలా తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై జెండా ఎగరేసింది.రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన ఆస్కార్ అవార్డు ( Oscar Award ) రావడం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణంగా నిలిచింది.

ఇలా ఆస్కార్ అవార్డులను చాలా గౌరవంగా భావిస్తారు ఇకపోతే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఆస్కార్ అఫీషియల్ ఇంస్టాగ్రామ్ లో పలువురు సెలబ్రిటీలను ఫాలో అవుతూ ఉంటారు.అయితే ఆస్కార్ తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ లో కేవలం ఇద్దరే ఇద్దరు ఇండియన్ హీరోలను (Indian Heroes) ఫాలో అవుతుంది.ఇలా ఆస్కార్ తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఫాలో అవుతున్నటువంటి ఆ ఇద్దరు ఇండియన్ హీరోస్ ఎవరు అనే విషయానికి వస్తే… ఆర్ఆర్ఆర్ ( RRR ) సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు ఎన్టీఆర్ ( NTR ) ఒకరు కాగా మరొకరు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్.

ఇలా ఆస్కార్ తన ఇన్స్టాగ్రామ్ ( Instagram )అఫీషియల్ హ్యాండిల్స్ లో ఇద్దరు ఇండియన్ హీరోలను మాత్రమే ఫాలో అవుతున్నారని తెలియడంతో వీరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ అండ్ షారుఖ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో.ది రియల్ గ్లోబల్ స్టార్స్ అంటూ సందడి చేస్తున్నారు.
ఇకపోతే ఆస్కార్ అందుకున్నటువంటి RRR చిత్ర బృందం నేడు ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ కి చేరుకున్నారు.ఇలా వీరందరూ ఎయిర్ పోర్ట్ లో సందడి చేయడంతో పెద్ద ఎత్తున అభిమానులు మీడియా చుట్టుముంటారు.
అయితే వీరు మీడియాతో ఏమాత్రం మాట్లాడకుండా జై హింద్ అంటూ మరోసారి అందరి మనసును దోచుకున్నారు.







