ఆరోగ్యం కాపాడే విషయంలో ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుందన్న విషయం అందరికి తెలిసిందే.ముఖ్యంగా ఈ ఉసిరిని ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు.
ఉసిరిలో విటమిన్ సి అధిక శాతం లభిస్తుంది.వీటితో పాటు అధిక శాతం ప్రోటీన్లు ఈ ఉసిరి కాయలో లభిస్తాయి.
ఆపిల్ పండు, దానిమ్మ పండు తో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువగా ఈ ఉసిరి లో మనకు ప్రొటీన్లు లభిస్తాయి.ఒంట్లోని కొవ్వును తగ్గించడంలో ఈ ఉసిరి దివ్య ఔషధంలా పనిచేస్తుంది.
ఉసిరిలో అనేకరకాల యాంటీవైరల్, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటి అనేక గుణాలు మనకు లభిస్తాయి.ఇక ఈ ఉసిరి ని తీసుకోవడం ద్వారా మన శరీరానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దామా…
ఉసిరి ద్వారా జుట్టు పోషణకు సంబంధించి ఎంతో ప్రాముఖ్యం చెందింది.
జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను ఈ ఉసిరి ద్వారా నయం చేసుకోవచ్చు.ముఖ్యంగా చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలను పూర్తిగా నయం చేసుకోవచ్చు.
అలాగే గుండె కు సంబంధించిన వ్యాధులకు, మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో ఈ ఉసిరి బాగా పనిచేస్తుంది.వీటితో పాటు మగవారిలో లైంగిక సామర్ధ్యం కలిగించాడని ఉసరి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా గుండెకు సంబంధించిన రక్తనాళలలో ఉండే కొవ్వును కరిగించడానికి ఈ ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతోంది.అలాగే శరీరంలో ఉండే వేడిని తగ్గించడంలో కూడా ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది.

ఉసిరి వల్ల జీర్ణకోశ సంబంధిత సమస్యలను తీర్చడంలో చాలా బాగా పనిచేస్తుంది.పొట్టలోని రసాయనాలను సమతుల్యం చేయడమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.అలాగే మెదడు పని తీరును కూడా మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచడంలో బాగా పనిచేస్తుంది.ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల శరీరాన్ని ఎండ తీవ్రత నుండి కాపాడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.