టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ( Allu Arjun )గత ఐదేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుంటూ తన రేంజ్ పెంచుకుంటున్నారు.అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ ( Ala Vaikunthapuram, Pushpa the Rise, Pushpa the Rule )సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
అయితే బన్నీ తన గురించి తాను చెప్పుకుంటూ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.బన్నీ పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.
తాను చాలా సాధారణ వ్యక్తినని అల్లు అర్జున్ చెప్పుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.తాను నూటికి నూరు శాతం కామన్ మేన్ అని బన్నీ వెల్లడించారు.
ఏదైనా సినిమా చూస్తున్న సమయంలో తాను సాధారణ వ్యక్తిగా ఉంటానని ఆయన కామెంట్లు చేశారు.సినిమా షూటింగ్స్ లేని సమయంలో తాను మరింత నార్మల్ గా ఉంటానని బన్నీ పేర్కొన్నారు.
షూటింగ్స్ లేని సమయంలో తాను ఏమీ చేయనని బన్నీ వెల్లడించారు.

ఏమీ చేయకుండా ఉండటమే తనకు ఇష్టమని బన్నీ పేర్కొన్నారు. తనకు ఎలాంటి గర్వం ఉండదని సినిమాల్లో ఎన్ని విజయాలు సాధించినా రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తానని బన్నీ వెల్లడించారు.బన్నీ తర్వాత సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.
మైథలాజికల్ టచ్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

బన్నీ త్రివిక్రమ్( Trivikram ) కాంబో మూవీ పాన్ వరల్డ్ స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బన్నీ తర్వాత మూవీ హారిక హాసిని బ్యానర్ లో తెరకెక్కనుంది.నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న బన్నీ తర్వాత ప్రాజెక్ట్స్ తో ఏ స్థాయిలో సంచనాలు సృష్టిస్తారో చూడాలి.