సాధారణంగా మనలో చాలా మంది ఉదయం లేవగానే టీ లేదా కాఫీ (Tea, Coffee)తాగుతుంటారు.అయితే టీ, కాఫీ బదులుగా రోజు మార్నింగ్ ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను కనుక తాగితే ఆరోగ్యమే కాదు అందం కూడా పెరుగుతుంది.
మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు సన్నగా తరిగిన ఉసిరికాయ (Amla)ముక్కలు వేసుకోవాలి.
అలాగే మూడు రెబ్బలు ఫ్రెష్ కరివేపాకు(Curry leaves), అంగుళం పొట్టు తొలగించిన అల్లం (Ginger)ముక్క మరియు ఒక కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసి ఐస్ ట్రే(Ice tray) లో నింపుకోవాలి.
ఐస్ క్యూబ్స్ తయారైన తర్వాత ఒక జిప్ లాక్ బ్యాగ్ లో వేసుకుని స్టోర్ చేసుకోవాలి.

ఇక రోజు ఉదయం ఒక గ్లాస్ హాట్ వాటర్ లో రెండు ఆమ్లా ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మన డ్రింక్ రెడీ అయినట్లే.ఈ ఆమ్లా డ్రింక్(Amla drink) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ఉసిరి, అల్లం మరియు కరివేపాకు మూడింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి, ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.
ఆమ్లాలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది, ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.

అలాగే ఈ ఆమ్లా డ్రింక్ శరీరంలో వాపు, నొప్పులను తగ్గించే యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది.రోజూ ఉదయం ఈ డ్రింక్ ను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంటాయి.జీర్ణాశయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఉసిరి మరియు కరివేపాకు రెండింటిలోనూ ఉండే పోషకాల కారణంగా రక్తహీనత సమస్య ఉండే దూరం అవుతుంది.అంతేకాదు ఈ ఆమ్లా డ్రింక్ ఆరోగ్యమైన, మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది మరియు అకాల బూడిద రంగును నివారించడంలోనూ ఉత్తమంగా సహాయపడుతుంది.







