ప్రకృతి మనకు ప్రసాదించిన వరాల్లో పండ్లు ఒకటి.రోజుకు రెండు రకాల పండ్లు తినడం వల్ల వివిధ రోగాలకు దూరంగా ఉండొచ్చు.
శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలను ఫ్రూట్స్ ద్వారా పొందొచ్చు.అయితే ఫ్రూట్స్ ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు కూడా తోడ్పడతాయి.
ఈ నేపథ్యంలోనే జుట్టు ఆరోగ్యానికి, ఎదుగుదలకు తోడ్పడే కొన్ని ఫ్రూట్ మాస్క్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పైనాపిల్ మరియు కోకోనట్ మిల్క్ మాస్క్ జుట్టును హైడ్రేట్ చేస్తుంది.
జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది.చుండ్రుని తగ్గిస్తుంది మరియు జుట్టుకు కొత్త మెరుపును జోడిస్తుంది.
అందుకోసం అర కప్పు ఫ్రెస్ పైనాపిల్ జ్యూస్ లో పావు కప్పు కొబ్బరి పాలు మిక్స్ చేసి స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించాలి.గంట అనంతరం హైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే పైన చెప్పుకున్న ప్రయోజనాలను పొందవచ్చు.

బొప్పాయి మరియు పెరుగు మాస్క్ కూడా జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.కొన్ని బొప్పాయి పండు ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసి.అందులో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కలిపి తలకు పట్టించాలి.నలభై నిమిషాల అనంతరం హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ మాస్క్ జుట్టును ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.కురులను మృదువుగా మారుస్తుంది.
మరియు హెయిర్ ఫాల్ కు చెక్ పెడుతుంది.

ఆరెంజ్ మరియు పెరుగు మాస్క్ వల్ల కూడా కేశ సంరక్షణలో అనేక లాభాలు ఉన్నాయి.అర కప్పుడు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కలిపి స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించాలి.అరగంట తర్వాత మైల్డ్ షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి.
ఈ మాస్క్ పొడిబారిన జుట్టుకు తేమను అందించి దాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.స్కాల్ప్‌ను శుభ్రపరచి చుండ్రును నివారిస్తుంది.
ఆరెంజ్‌లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది జుట్టు వృద్ధికి సహాయపడుతుంది.ఆరెంజ్ మరియు పెరుగులో ఉండే న్యూట్రియెంట్స్ జుట్టును దృఢంగా, ఆరోగ్యంగా మార్చడంలో హెల్ప్ చేస్తాయి.







