ఆదివారం మాంసం తినని ఊరు ఇదే.. ఈ దేవుడిని పూజిస్తే కోరిన కోరికలు తీరతాయంటూ?

సాధారణంగా ఆదివారం రోజున( Sunday ) మాంసం తినడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు.అయితే ఒక ఊరిలో మాత్రం ఆదివారం రోజున మాంసం( Meat ) అస్సలు తినరు.

 Significance Of Kotturu Subrahmanyeswara Swamy Temple Details, Subrahmanyeswara-TeluguStop.com

నంద్యాల జిల్లాలోని( Nandyala District ) ఎస్.కొత్తూరు( S Kotturu ) గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం( Subrahmanyeswara Swamy Temple ) ఆదివారం రోజు వస్తే చాలు భక్తులతో కిటకిటలాడుతుంది.

ఈ ఊరివాళ్లు మాంసం తినకుండా ఉండటంతో పాటు మద్యానికి కూడా దూరంగా ఉంటారు.

ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్ప రూపంలో కొలువై ఉంటారు.

మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం నిర్మాణ శైలి ఇతర ఆలయాలకు భిన్నంగా ఉంటుంది.ఈ ఆలయంలో స్వామి స్వయంభువుగా వెలిశాడని కూడా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.300 సంవత్సరాల క్రితం బీరం చెన్నారెడ్డి అనే రైతు పొలం దున్నుతున్న సమయంలో నాగలికి ఏదో ఒక రాయి అడ్డుగా తగిలింది.

ఆ రైతు శబ్దం వచ్చిన చోట చూస్తే 12 శిరస్సులతో ఉన్న నాగేంద్రుని విగ్రహం బయటపడింది.అయితే అదే సమయంలో ఆ రైతుకు( Farmer ) చూపు పోయింది.ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు ఆ విగ్రహం సుబ్రహ్మణేశ్వర్య స్వామి విగ్రహమని స్వామికి మూడు రోజులు అభిషేకం చేస్తే రైతుకు పోయిన చూపు తిరిగి వస్తుందని చెప్పారు.

చెప్పిన విధంగా రైతుకు చూపు తిరిగివచ్చింది.

ఈ ఆలయం గర్భగుడి లేకుండానే నిర్మించిన ఆలయం కావడం గమనార్హం.ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆలయానికి భక్తులు వస్తారు.ఈ ఆలయంలో స్వామికి అభిషేకాలు నిర్వహించడం ద్వారా సర్పదోషాలు( Sarpa Dosh ) తొలగిపోతాయి.

కోరిన కోరికలు తీరిన వాళ్లు ఈ ఆలయంలో నాగ ప్రతిష్ట చేయించడానికి ఆసక్తి చూపుతారు.ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుంటే మంచిది.ఈ దేవుడిని పూజించడం ద్వారా భక్తులు కోరుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరే అవకాశాలు అయితే ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube