ఆదివారం మాంసం తినని ఊరు ఇదే.. ఈ దేవుడిని పూజిస్తే కోరిన కోరికలు తీరతాయంటూ?

సాధారణంగా ఆదివారం రోజున( Sunday ) మాంసం తినడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు.

అయితే ఒక ఊరిలో మాత్రం ఆదివారం రోజున మాంసం( Meat ) అస్సలు తినరు.

నంద్యాల జిల్లాలోని( Nandyala District ) ఎస్.కొత్తూరు( S Kotturu ) గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం( Subrahmanyeswara Swamy Temple ) ఆదివారం రోజు వస్తే చాలు భక్తులతో కిటకిటలాడుతుంది.

ఈ ఊరివాళ్లు మాంసం తినకుండా ఉండటంతో పాటు మద్యానికి కూడా దూరంగా ఉంటారు.

ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్ప రూపంలో కొలువై ఉంటారు.మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం నిర్మాణ శైలి ఇతర ఆలయాలకు భిన్నంగా ఉంటుంది.

ఈ ఆలయంలో స్వామి స్వయంభువుగా వెలిశాడని కూడా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

300 సంవత్సరాల క్రితం బీరం చెన్నారెడ్డి అనే రైతు పొలం దున్నుతున్న సమయంలో నాగలికి ఏదో ఒక రాయి అడ్డుగా తగిలింది.

"""/" / ఆ రైతు శబ్దం వచ్చిన చోట చూస్తే 12 శిరస్సులతో ఉన్న నాగేంద్రుని విగ్రహం బయటపడింది.

అయితే అదే సమయంలో ఆ రైతుకు( Farmer ) చూపు పోయింది.ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు ఆ విగ్రహం సుబ్రహ్మణేశ్వర్య స్వామి విగ్రహమని స్వామికి మూడు రోజులు అభిషేకం చేస్తే రైతుకు పోయిన చూపు తిరిగి వస్తుందని చెప్పారు.

చెప్పిన విధంగా రైతుకు చూపు తిరిగివచ్చింది. """/" / ఈ ఆలయం గర్భగుడి లేకుండానే నిర్మించిన ఆలయం కావడం గమనార్హం.

ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆలయానికి భక్తులు వస్తారు.ఈ ఆలయంలో స్వామికి అభిషేకాలు నిర్వహించడం ద్వారా సర్పదోషాలు( Sarpa Dosh ) తొలగిపోతాయి.

కోరిన కోరికలు తీరిన వాళ్లు ఈ ఆలయంలో నాగ ప్రతిష్ట చేయించడానికి ఆసక్తి చూపుతారు.

ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుంటే మంచిది.ఈ దేవుడిని పూజించడం ద్వారా భక్తులు కోరుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరే అవకాశాలు అయితే ఉంటాయి.

ఆరోగ్యానికి వరం బాదం.. కానీ ఎవరెవరు తినకూడదో తెలుసా?