ఏపీలో బీజేపీ( AP BJP ) డబుల్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది.ఏ విషయంపై కూడా స్పష్టతనివ్వకుండా అటు ఇతర పార్టీలను ఇటు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ గందరగోళానికి గురి చేస్తోంది.
గత కొన్నాళ్లుగా పొత్తుల విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు విశ్లేషకులకు సైతం అంతుచిక్కడం లేదు.ఏపీలో ఏ మాత్రం బలం లేకపోయినప్పటికి కాషాయ పార్టీ పొత్తు అంశం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే మారుతోంది.
ఇప్పటికే జనసేన పార్టీతో( Janasena ) పొత్తులో ఉన్న బీజేపీ.వైసీపీని ఓడించాలంటే టీడీపీతో కూడా కలవాల్సిన పరిస్థితి.
దాంతో టీడీపీతో కలవడంపైనే ఇప్పుడు అసలు చిక్కు.ఆ పార్టీతో కలవాలా ? లేదా అనే దానిపై కాషాయ పెద్దలు ఎప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.కానీ ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే టీడీపీతో కలిసేందుకే బీజేపీ సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది.

తరచూ చంద్రబాబుతో( Chandrababu Naidu ) బీజేపీ పెద్దలు బేటీ కావడం, రాష్ట్ర బీజేపీ నేతలు కూడా టీడీపీపై విమర్శలు తగ్గించడం వంటివి చూస్తే టీడీపీతో కలిసేందుకు బీజేపీ సిద్దమౌతుందని చెప్పక తప్పదు.ఇదే విషయాన్ని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు అధినారాయణ రెడ్డి( Adinarayana Reddy ) కూడా స్పష్టం చేశారు.టీడీపీతో కలవడంపై పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడుతుందని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి అంతకుముందు బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు( GVL Narasimha Rao ) చేసిన వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పుకొచ్చారు.
ఇక్కడ ఆయన టీడీపీ ప్రస్తావన తీసుకురాలేదు.

దీంతో టీడీపీ విషయంలో బీజేపీ వైఖరి ఏంటో అర్థంకాక విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు.అయితే కొందరు చెబుతున్నా దాని ప్రకారం బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని, పొత్తు విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా కూటమిలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోందని కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.ఎందుకంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.దాంతో ఏపీలో సత్తా చాటలంటే కూటమిలో టీడీపీ జనసేన పార్టీలపై ఆధిపత్య పాత్ర పోషించడం అవసరం.అందుకే పొత్త విషయంలో క్లారిటీ ఇవ్వకుండా బీజేపీ డబుల్ మైండ్ గేమ్ ఆడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరి కాషాయ పార్టీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.