ఎఫ్‌బీఐకే టోకరా .. పంజాబ్‌ పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ భారత సంతతి స్మగ్లర్

అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( Federal Bureau of Investigation ) (ఎఫ్‌బీఐ) వెతుకుతున్న డ్రగ్స్ లీడర్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడిని భారత సంతతికి చెందిన షెహనాజ్ సింగ్ ( Shehnaaz Singh )అలియాస్ షాన్ భిందర్‌గా గుర్తించారు.

 Punjab Police Arrest Fbi-wanted Indian Origin Drug Gang Leader , Drug Gang Leade-TeluguStop.com

ఇతను గ్లోబల్ డ్రగ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో కింగ్ పిన్‌గా ఆరోపిస్తున్నారు పోలీసులు.షెహనాజ్ కొలంబియా నుంచి అమెరికా, కెనడాలకు కొకైన్‌ను అక్రమంగా రవాణా చేసినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.

బటాలాలోని మండియాల గ్రామానికి చెందిన భిందర్ 2014 నుంచి కెనడాలోని బ్రాంప్టన్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఎఫ్‌బీఐ.

ఈ సిండికేట్‌తో సంబంధం ఉన్న ఇళ్లు, వాహనాల నుంచి దాదాపు 391 కేజీల మెథాంఫెటమైన్, 109 కిలోల కొకైన్, నాలుగు అత్యాధునిక ఆయుధాలు సహా పెద్ద మొత్తం మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది.

Telugu Amritpal Singh, Drug Gang, Federal Bureau, Punjabdgp, Punjab, Shehnaaz Si

ఈ ఆపరేషన్‌లో అమృత్‌పాల్ సింగ్ ( Amritpal Singh )అలియాస్ అమృత్ అలియాస్ బాల్, అమృత్‌పాల్ సింగ్ అలియాస్ చీమా, తఖ్‌దీర్ సింగ్ అలియాస్ రోమి, సరబ్జిత్ సింగ్ సాబీ, ఫెర్నాండో వల్లాడారెస్ అలియాస్ ఫ్రాంకో, గుర్లాల్ సింగ్‌లను ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది.ఈ సమయంలో కెనడాలో ఉన్న భిందర్ అరెస్ట్ నుంచి తప్పించుకుని మార్చిలో రహస్యంగా భారత్‌లో అడుగుపెట్టాడు.భిందర్ అరెస్ట్‌పై పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ( Punjab DGP Gaurav Yadav )మాట్లాడుతూ.

గ్లోబల్ నార్కోటిక్స్ సిండికేట్‌లో అతను కీలక సూత్రధారి అని తెలిపారు.భిందర్‌ లూథియానాలో ఉన్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేశామని డీజీపీ వెల్లడించారు.గతేడాది డిసెంబర్‌లో నమోదైన ఆయుధ చట్టం కేసులోనూ భిందర్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని ఆయన తెలిపారు.

Telugu Amritpal Singh, Drug Gang, Federal Bureau, Punjabdgp, Punjab, Shehnaaz Si

అంతర్జాతీయ సరిహద్దుల గుండా ట్రక్కులు, ట్రైలర్లను ఉపయోగించి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను రవాణా చేయడంలో భిందర్ కీలకపాత్ర పోషించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీస్ అధికారులు తెలిపారు.2014 నుంచి రవాణా వ్యాపారం ముసుగులో కొలంబియా నుంచి మెక్సికో ద్వారా అమెరికా, కెనడాలకు మాదక ద్రవ్యాల రవాణా చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube