అక్కినేని హీరోలలో ఒకరైన అఖిల్( Akhil ) ఇప్పటివరకు ఐదు సినిమాలలో నటించినా ఆ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.కథల ఎంపికలో లోపమో మరేదైనా కారణమో తెలీదు కానీ అఖిల్ కు అదృష్టం మాత్రం ఆశించిన స్థాయిలో కలిసిరాలేదు.
అఖిల్ కు కెరీర్ బెస్ట్ హిట్లు దక్కాలని అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna )సైతం భావిస్తున్నారు.అఖిల్ కొత్త సినిమా ఈ నెల 14వ తేదీ నుంచి మొదలుకానుంది.
వినరో భాగ్యము విష్ణుకథ దర్శకుడు మురళీ కిషోర్( Murali Kishore ) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా అక్కినేని హీరోలకు పల్లెటూరి బ్యాక్ డ్రాప్ సినిమాలు అచ్చొచ్చిన సంగతి తెలిసిందే.
ఆ సెంటిమెంట్ ప్రకారం అఖిల్ కు సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అఖిల్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.
అఖిల్ భవిష్యత్తు సినిమాల విషయంలో నాగ్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలి.

ఈ సినిమాతో పాటు అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ ( UV Creations Banner )లో ఒక సినిమాలో నటించనున్నారు.ఆ సినిమా కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది.వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న అఖిల్ ఈ సినిమాలతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.
వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదురవుతున్నా అఖిల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెరుగుతోంది.

అఖిల్ భవిష్యత్తు సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకుంటారా? లేక లాభాల్లో వాటా తీసుకుంటారా? అనే ప్రశ్నలకు సంబంధించి జవాబులు దొరకాల్సి ఉంది.అఖిల్ భవిష్యత్తు సినిమాలకు సంబంధించి లుక్స్ విషయంలో కేర్ తీసుకుంటున్నారని భోగట్టా.అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎక్కువ సంఖ్యలో మల్టీస్టారర్లు తెరకెక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
అక్కినేని అఖిల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.







