సినీ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నాచురల్ స్టార్ నాని( Nani ) ఒకరు.ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా తన ప్రయాణం మొదలుపెట్టారు.
ఇలా అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగుతున్న సమయంలోనే అష్టాచమ్మా సినిమా ద్వారా హీరోగా అవకాశం అందుకున్నారు.ఇక ఈ సినమా మంచి సక్సెస్ కావడంతో వరుసగా నాని సినిమాలు చేస్తే స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు పొందడమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ఈయన ప్రస్తుతం రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి( Priyadarshi ) హీరోగా నటిస్తున్న కోర్టు ( Court )సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.ఈ సినిమా హోలీ పండుగ సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే నాని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇందులో భాగంగా ఈయన చిరంజీవి ( Chiranjeevi )గారు తన గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలను అందరితో పంచుకున్నారు.
నాగచైతన్య పెళ్లి రోజున ఈయన కారు దిగి కళ్యాణమండపం లోపలికి వెళ్తున్నానని తెలిపారు.అదే సమయంలో ఎదురుగా చిరంజీవి గారు వస్తున్నారు.

చిరంజీవి గారు నన్ను చూసి ప్రొడ్యూసర్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా అంటూ అడిగారు.నేను నా వెనకాల ఎవరైనా పెద్ద ప్రొడ్యూసర్లు వస్తున్నారేమోనని వెనక్కి తిరిగి వారి కోసం వెతుకుతున్నాను.వెంటనే చిరంజీవి గారు మిమ్మల్నే ప్రొడ్యూసర్ గారు.బాగున్నారా అంటూ ఆయన నన్ను ఒక హగ్ చేసుకున్నారు.ఆ క్షణం నాకు ఒక్కసారిగా ఆశ్చర్యం వేసిందని తెలిపారు.చిరంజీవి గారు నన్ను అలా పిలవడం ఈ జన్మకు మర్చిపోలేను అంటూ నాని సంతోషం వ్యక్తం చేశారు.
ఇక నాని నిర్మాణంలో చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసింది.







