తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) లాంటి నటుడు సైతం ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ముందు వరుసలో ఉన్నాడు.ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాతో ఎంతో కొంత వైవిధ్యాన్ని చాటుకున్న ఆయన ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చూస్తున్నాడు.ఇక రౌడీ జనార్ధన్(Rowdy Janardhan) అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాతో ఆయనకు డిఫరెంట్ ఇమేజ్ అయితే వస్తుందని తను చాలా వరకు నమ్ముతున్నట్టుగా తెలుస్తోంది.తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

అర్జున్ రెడ్డి, గీతగోవిందం(Arjun Reddy, Geetha Govindam) సినిమా తర్వాత ఆయనకు ఆ రేంజ్ లో సక్సెస్ అయితే రాలేదు.మరి ఇప్పుడు అలాంటి సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.ఒకవేళ ఆయన సక్సెస్ ని సాధించకపోతే మాత్రం ఆయన భారీగా నష్టపోవాల్సిన అవసరమైతే ఉంది.తన మార్కెట్ ను కూడా చాలా వరకు కోల్పోతాడు.ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఆయన ఆచితూచి వ్యవహరిస్తే మంచిదని చాలామంది సినిమా మేధావులు సైతం ఆయన సినిమా సెలక్షన్లో చాలా జాగ్రత్తగా ఉంటూ మంచి స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకోవాలనే సలహాలు ఇస్తున్నారు…
.