తేనె.ఎంత మధురంగా ఉంటుందో అంతే ఎక్కువ పోషకాలనూ కలిగి ఉంటుంది.మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరంగా తేనెను చెప్పుకుంటారు.ఎందు కంటే, ఆరోగ్య పరంగానే కాదు.చర్మ సౌందర్యాన్ని పెంచడంలోనూ, జుట్టును సంరక్షించడంలోనూ తేనె విశేషంగా సహాయపడుతుంది.అటువంటి తేనెను నాభిపై ఇప్పుడు చెప్పబోయే విధంగా రోజు రాస్తే మీరు అస్సలు ఊహించలేని ఆరోగ్య లాభాలను పొందవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం నాభి పై తేనె ను రాయడం వల్ల ఏయే ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకుందాం పదండీ.
సాధారణంగా చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.
నాభిని సరిగ్గా శుభ్రం చేసుకోరు.దాంతో మలినాలన్నీ అక్కడ చేరిపోయి ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.
ఫలితంగా దురద, మంట వంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే అలాంటి పరిస్థితుల్లో నాభిపై స్వచ్ఛమైన తేనె ను రోజూ కొద్దిగా రాస్తే గనుక.
అందులోని యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ ను తగ్గించి నాభిని అందంగా ఆరోగ్యంగా మారుస్తాయి.
అలాగే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది మలబద్ధకం సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు.అయితే రెగ్యులర్‌గా తేనెను నాభిపై అప్లై చేయడం వల్ల మలబద్ధకం సమస్య క్రమంగా తగ్గిపోతుంది.జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగు పరచడంలోనూ తేనె ఉపయోగపడుతుంది.
ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ అల్లం రసం కలిపి నాభిపై పూసుకోవాలి.ఇలా నైట్ నిద్రించే ముందు రాసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ చురుగ్గా మారుతుంది.
తద్వారా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
ఇక మహిళలు నెలసరి సమయంలో తేనెను తీసుకుని అందులో కొద్ది పసుపు కలిపి నాభిపై అప్లై చేయాలి.
ఇలా చేయడం వల్ల పొత్తు కడుపు నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందొచ్చు.