ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇక రాజమౌళి(Rajamouli ) లాంటి దర్శకుడు సైతం సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.
ఆయన చేసిన సినిమాలన్నీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి.కాబట్టి ఇక మీదట ఆయన చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలామంది జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో(Mahesh Babu) చేస్తున్న సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని తను చాలా క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో విలన్ గా మలయాళం స్టార్ హీరో అయిన పృధ్విరాజ్ సుకుమారన్(Malayalam star hero, Prithviraj Sukumaran) నటిస్తున్నాడు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి.తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విలనిజాన్ని పండిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నింటికీ భిన్నంగా ఈ సినిమాలో విలనిజాన్ని పండించబోతున్నారట.
మరి రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ.్చు ఇక ఈ సినిమా సైతం దానికి ఏమాత్రం తీసిపోకుండా ఒక డిఫరెంట్ వే లో ప్రజెంట్ చేయాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక రాజమౌళి ఇంతకుముందు చేసిన ‘ బహుబలి ‘, ‘త్రిబుల్ ఆర్’(Bahubali, RRR) సినిమాలు మంచి విజయాలను సాధించాయి.ఈ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా మహేష్ బాబు సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందనే ధృడ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారు.చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది…
.







