ప్రస్తుత కాలంలో రోజంతా ఎనర్జిటిక్‌గా పని చేయడం అనేది ప్రతి ఒక్కరికి గగనంలా మారింది.ఎంత ఎనర్జిటిక్‌గా ఉండాలని ప్రయత్నించినా.
మధ్యాహ్నానికే నీరసం వచ్చేస్తుంటుంది.ఆ నీరసాన్ని పోగొట్టుకునేందుకు బర్గర్లు, పిజ్జాలు, శాండ్విచ్‌లు, చాట్‌లు ఇలా ఏది పడితే అది తింటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటుంటారు.
ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సూపర్ టేస్టీ అండ్ హెల్తీ స్పూతీని మీ డైట్‌లో గనుక చేర్చుకుంటే నీరసం, అలసట వంటివి దరి చేరకుండా ఉంటాయి.అదే సమయంలో రోజంతా ఎనర్జిటిక్‌గా కూడా ఉంటారు.
మరి ఇంకెందు లేటు ఆ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్, రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకుని.
స్పూన్‌తో తిప్పుకుంటూ పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే రాగి జావ సిద్ధం అవుతుంది.ఈ రాగి జావను చల్లారబెట్టుకోవాలి.
ఈలోపు ఒక క్యారెట్‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఇందులో చల్లారబెట్టుకున్న రాగి జావ, పావు స్పూన్ సాల్ట్, పావు స్పూన్ వెయించిన జీలకర్ర పొడి, చిటికెడు నల్ల ఉప్పు వేసి మళ్లీ గ్రైండ్ చేసుకుంటే స్మూతీ సిద్ధమైనట్లై.

ఈ స్మూతీని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే.నీరసం, అలసట దరి చేరకుండా ఉంటాయి.రోజంతా ఎనర్జిటిక్‌గా పని చేసుకునేందుకు తగినంత శక్తి మన శరీరానికి లభిస్తుంది.
అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల అతి ఆకలి దూరమై బరువు తగ్గుతారు.