మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి ఎన్నో ఆయుర్వేద మరియు అల్లోపతి పద్ధతులు, యోగాసనాలు, వ్యాయామాలు ఉన్నాయి.కానీ ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న, ఎన్ని కొత్త మార్గాలు వెతికిన ఈ సమస్యలు పూర్తిగా దూరం కావు.
కొన్ని సార్లు మీ సమస్యకు వాస్తు సమస్య కూడా కారణమవుతుంది.మానసికంగా మరియు శరీరకంగా దూరంగా ఉండడానికి వాస్తు యొక్క ఈ ప్రత్యేక మార్గాలను పాటిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కొన్ని వస్తువులను దిండు( Pillow ) కింద ఉంచడం వల్ల మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది.దిండు కింద ఏ వస్తువులు పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం దిండు కింద సువాసనగల పూలను( Flowers ) పెట్టుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి దూరం అవుతుంది.దీంతో వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.అలాగే నిద్రపోవడానికి ముందు దిండు కింద తూర్పు దిశలో నాణేన్ని ( Coin ) ఉంచుకుంటే ఆరోగ్యానికి మంచిదని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఒత్తిడి వల్ల నిద్రలో భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి.
ఈ సందర్భంలో కత్తిని దిండు కింద ఉంచి నిద్రపోవాలి.ఇది మీకు వచ్చే పీడ కలలను దూరం చేస్తుంది.
అయితే కత్తిని ఎంతో జాగ్రత్తగా నిండు కింద ఉంచాలి.పదనులేని కత్తిని పెట్టడం మంచిది.
లేదంటే పీడకలు ఏమో కానీ కొన్ని రకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

ఇంకా చెప్పాలంటే దిండుకు కింద వెల్లుల్లి( Garlic ) పెట్టీ నిద్రపోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీతో పాటు, గాఢ నిద్ర వస్తుందని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే మెంతి గింజలను దిండు కింద ఉంచడం వల్ల కుజ దోషం దూరమైపోయి, మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది.ముఖ్యంగా చెప్పాలంటే మంచం పక్కన నేల పై ఒక గ్లాసు నీరు ఉంచడం మంచిదని పండితులు చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల ఆరోగ్యం చెక్కుచెదరకుండా ఉంటుందని చెబుతున్నారు.