నాగార్జున సినిమా ఏమైంది.. ఆ రచయిత కి మొండి చేయి చూపించారా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున గత సంవత్సరం బంగార్రాజు మరియు ది ఘోస్ట్‌ సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమాల్లో బంగార్రాజు మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, ఏడాది చివర్లో వచ్చిన ది ఘోస్ట్ సినిమా నిరాశ వచ్చింది.

 Tollywood King Nagarjuna Next Film Update , Nagarjuna, Prasanna Kumar, Writer Pr-TeluguStop.com

దాంతో నాగార్జున వెంటనే చేయాలనుకున్న మోహన్ రాజా సినిమా ను ఆపివేశాడు.ఇప్పటికే ఆ సినిమా క్యాన్సిల్ అయిందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

మోహన్ రాజా గత చిత్రం గాడ్ ఫాదర్ సక్సెస్ టాక్‌ దక్కించుకున్నా కూడా కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాబట్టలేక పోయింది.అందుకే మోహన్‌ రాజా తో సినిమా ప్రస్తుతానికి పక్కకు పెట్టాడని.

ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వం లో నాగార్జున సినిమా చేయబోతున్నాడని డిసెంబర్ నెలలో తెగ ప్రచారం జరిగింది.జనవరి నెలలో సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది అంటూ అక్కినేని ఫ్యాన్స్ తో పాటు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు.

కానీ జనవరి కూడా వెళ్ళి పోబోతుంది.ఇప్పటి వరకు ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వం లో నాగార్జున సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు.ధమాకా వంటి సూపర్ హిట్ సినిమాలకు రైటర్ గా పని చేసిన ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకుడిగా వెంటనే ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.నాగార్జున ఓకే చెప్పినప్పటికీ ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ రాక పోవడంతో ప్రసన్నకుమార్ వెయిట్ చేస్తున్నాడు.

గత ఆరు నెలలుగా ప్రసన్న కుమార్, నాగార్జున చుట్టూ తిరుగుతూ వచ్చాడు.అదిగో ఇదిగో అంటూ షూటింగ్ మొదలు పెట్టేందుకు ఆలస్యం చేస్తున్నాడు.దాంతో చివరి నిమిషం లో ప్రసన్నకుమార్ కు నాగార్జున హ్యాండ్‌ ఇస్తాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నాగార్జున తదుపరి సినిమా ఏంటి అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

ప్రసన్న కుమార్ దర్శకత్వం లో సినిమా ఉంటే కచ్చితంగా అది హిట్ అయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube