మమతను టార్గెట్ చేసిన ఓవైసి

ఎం‌ఐ‌ఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఇప్పటి నుండే పావులు కదుపుతున్నాడు.ఈ నేపథ్యంలో శనివారం నాడు బెంగాల్ లోని హుగ్లీ జిల్లాకు చేరుకొని అక్కడ ప్రముఖ ముస్లిం నేత అయిన అబ్బాస్ సిద్దీఖీని కలుసుకున్నాడు.

 Mim Party Chief Comments On Mamatha Benarji, Abbas Siddiqi, Bengal, Mamatha Bena-TeluguStop.com

బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని పదే పదే విమర్శించడం ద్వారా వెలుగులోకి వచ్చిన అబ్బాస్ సిద్దీఖీని ఓవైసి కలుసుకోవడం అక్కడ ప్రదాన్యతను సంతరించుకుంది.అబ్బాస్ సిద్దీఖీ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా గతంలోనే ప్రకటించాడు.

ఈ నేపథ్యంలో ఓవైసీ అబ్బాస్ సిద్దీఖీతో కలిసి పని చెయ్యడం కానీ లేకపోతే ఒంటరిగా వేటికవే పోటీ చేయ్యడం కాని జరగవచ్చు అని భావిస్తున్నారు.ఎం‌ఐ‌ఎం నేత అసదుద్దీన్ మాట్లాడుతూ.

మమత బెనర్జీపై విమర్శలు చేశాడు.ఎం‌ఐ‌ఎం పార్టీని బి‌జే‌పి కి బి గ్రేడ్ పార్టీగా మమత విమర్శించడాన్ని ఓవైసీ తప్పు పట్టాడు.

ముందుగ బెంగాల్ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి అన్నాడు.గత అసెంబ్లి ఎన్నికలో ఇక్కడ బి‌జే‌పి 18 సీట్లు గెలిచిందని గుర్తు చేశాడు.

మమత పాలనపై బెంగాల్ ప్రజలు విసిగిపోయారు అందుకే మార్పును కోరుకుంటున్నారు అని అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube