అంబేద్కర్ కు నిజమైన గౌరవం

ఎన్నాళ్ళో ఎదురు చూసిన కల భారతీయులకు, ముఖ్యంగా దళిత వర్గానికి సంతోషాన్నిచ్చే వార్త .అంబేద్కర్ కు నిజమైన గౌరవం దక్కింది.

 Andhra Pradesh Government Planning 125 Feet Ambedkar Statue At Vijayawada Swaraj-TeluguStop.com

భారత రాజ్యాంగ పిత అంబేద్కర్ కు అసలు,సిసలైన విలువ ఇచ్చినట్లు అయింది.భారతీయులందరికి శుభ వర్తమానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలక పక్షం అందించింది.

ఆయన నిలువెత్తు విగ్రహం త్వరలో చూపరులను ఆకట్టుకోనుంది.విజయవాడలోని స్వరాజ్య మైదానంలో దాదాపు మూడు వందల కోట్లతో, నూటా ఇరవై ఐదు అడుగుల విగ్రహం నెలకొల్పుట చరిత్రలోనే ఓ అపూర్వ సంఘటన.

ఆంధ్రప్రదేశ్ పాలక పక్షం ఇన్నాళ్లకు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని నిర్ణయించడం ముదావహం.ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగ నాగార్జున ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను పర్యవేక్షణ చేస్తున్నారు.

ఆయన మాటలలో అంబెడ్కర్ విగ్రహ కృషికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించారు.విగ్రహ పనులు శరవేగంతో పూర్తి చేస్తాం.

అతి త్వరలో స్మృతి వనం ఓ పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోనుంది.వచ్చే ఏడాది అంటే 2023 కు ఆయన జయంతి రోజున ఏప్రిల్ 14 న విగ్రహ పనులు పూర్తి చేసి ప్రజల సందర్శనకు చర్యలు తీసుకుంటున్నారు.

భారత దేశంలో అంటరాని తనం రూపుమపాలని,పౌరులు అందరూ సమైక్యత, సౌబ్రాతృత్వంతో నడచు కోవాలి అని ఆయన అభిలషించారు.అంబేద్కర్ ఆశలు,ఆశయాలు, ఆయన రచనలతో స్మృతి వనం లో ఓ గ్రంధాలయం కూడా నెలకొల్పాలనే యోచన ప్రభుత్వానికి ఉంది.

భారత్ లోనే కాకుండా ప్రపంచ దేశాలు సైతం అంబేద్కర్ గురించి తెలియని వారు అరుదు.

Telugu Feetambedkar, Andhra Pradesh, Drbr, Dr Br Ambedkar, India, Vijayawada-Pol

ఆయన నడవడి, వ్యక్తిత్వం ఎందరో భావి నాయకులకు స్ఫూర్తి.అంబేద్కర్ అసమాన నాయకుడు,మేధావి.భారత దేశంలో గర్వించదగ్గ నాయకులలో ఆయన ఒకరు.

అంబెడ్కర్ కు సముచిత స్థానం ఉంది.దళితులకు మాత్రమే కాకుండా ప్రజలందరి కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి.

కులం అనేది దేశ ప్రగతికి అవరోధమని,కులం పేరుతో ఎవరిని నిందించరాదు.అస్పృశ్యత భారత దేశ అభివృద్ధి కి గొడ్డలి పెట్టు.

దానిని నేరంగా పరిగణించాలి.అందు కోసం భారత దేశ ప్రాథమిక హక్కులో పదిహేడవ (17) వ ప్రకరణం ,అంటరాని తనం నేరంగా ప్రకటించారు.

సాక్షాత్తు ఆయానే కుల వివక్షకు కు గురి అయ్యారు.దళితులు గౌరవ ప్రదమైన స్థానాలలో ఉండాలని ఆయన అభిలషించారు.

దళితుల చదువు,అభివృద్ధి కోసం కృషి చేశాడు.

Telugu Feetambedkar, Andhra Pradesh, Drbr, Dr Br Ambedkar, India, Vijayawada-Pol

ఆ దిశలో అంబేద్కర్ కూడా రాణించి భారత న్యాయశాఖ మంత్రి గా పనిచేశారు.అంచెలంచెలుగా ఎదిగి ఎవరికి ,ఎప్పటికి సాధ్యం కానటు వంటి భారత రాజ్యాంగం రచించి భారత దేశానికి అందించారు.నేడు భారత ప్రభుత్వం పని తీరు రాజ్యాంగం కు అనుగుణంగా ఉంది.

రాజ్యాంగంలో ప్రతి అంశం విపులంగా చెప్పబడింది.ఆయన,ఆయన అనుచరులతో లికించబడిన భారత రాజ్యాంగం, భారత దేశానికి ఒక కరదీపిక.

అటువంటి మహాన్ వ్యక్తికి సరైన గుర్తింపు రావడం సంతోషించ దగ్గ నిర్ణయం.అతి త్వరలో ఆ మహనీయుని విగ్రహ స్థలం ఓ పర్యాటక స్థలంగా అందరి మన్నలను పొంది,సకల జనావళికి ఓ గుర్తింపు గా నిలుస్తుంది అనుటలో అతిశయోక్తి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube