మీకు ప్ర‌తిసారి నెల‌స‌రి ఆల‌స్యమ‌వుతుందా? అయితే ఈ డ్రింక్ తాగాల్సిందే!

నెల‌స‌రి ఆల‌స్యం కావ‌డం.చాలా మంది మ‌హిళ‌ల‌ను బాధించే కామ‌న్ స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

 Effective Drink To Get Rid Irregular Periods! Effective Drink, Irregular Period-TeluguStop.com

హార్మోన్ ఛేంజ‌స్‌, ర‌క్త హీన‌త‌, ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, థైరాయిడ్ ప్రాబ్లమ్, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, అధిక లేదా త‌క్కువ బ‌రువు, పోష‌కాల లోపం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల నెల‌స‌రి లేట్ అవుతూ ఉంటుంది.గర్భాశయం స‌మ‌స్య‌లు ఉన్న వారిలో కూడా ఈ సమస్య తలెత్తుంది.

దాంతో ఏం చేయాలో తెలియ‌క, ఎలా ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవాలో అర్థంగాక‌ తెగ స‌త‌మ‌త‌మైపోతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే డ్రింక్‌ను తీసుకుంటే గ‌నుక చాలా సులువుగా ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆస‌ల్యం ఆ డ్రింక్ ఏంటీ.? ఎలా త‌యారు చేసుకోవాలి.? వంటి విష‌యాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాట‌ర్ పోసుకోవాలి.

వాట‌ర్ కాస్త హీట్ అయ్యాక‌.ఒక టేబుల్‌ స్పూన్ సోంపు, ఒక టేబుల్‌ స్పూన్ త‌రిగిన అల్లం ముక్క‌లు, ఒక టేబుల్ స్పూన్ జీల‌క‌ర్ర‌, ఒక స్పూన్ ప‌చ్చి ప‌సుపు కొమ్ము ముక్క‌లు వేసుకుని బాగా మ‌రిగించాలి.వాట‌ర్‌ క‌ల‌ర్ ఛేంజ్ అయ్యాక స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసి ఒక స్పూన్ తేనె మిక్స్ చేసుకుని గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత సేవించాలి.

నెల స‌రి ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో ఈ సూప‌ర్ డ్రింక్‌ను నాలుగు నుంచి ఐదు రోజుల పాటు తీసుకోవాలి.ఇలా చేస్తే గ‌నుక నెల‌స‌రి ఆల‌స్యం అవ్వ‌కుండా ఉంటుంది.

పైగా ఈ డ్రింక్‌ను తీసుకుంటే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా మారుతుంది.శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వు క‌రిగి పోతుంది.

మ‌రియు జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఉంటే ప‌రార్ అవుతాయి.

Effective Drink To Get Rid Irregular Periods! Effective Drink, Irregular Periods, Periods, Latest News, Health Tips, Good Health, Women, - Telugu Effective, Tips, Latest, Periods #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube