సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలందరితో సినిమాలు చేసుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్న ఏకైక దర్శకుడు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఇప్పటికే ఆయన వెంకటేష్, బాలయ్య లాంటి సీనియర్ హీరోలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.ఇక వెంకటేష్ తో అయితే హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయడం విశేషం…ఇక రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం ‘( Sankranthiki Vasthunnam ) అనే సినిమాని రిలీజ్ చేసి ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు.
మరి ఏది ఏమైనా కూడా ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు యావత్ సినిమా ఇండస్ట్రీలో ఆ సినిమాల మీద మంచి అంచనాలైతే ఉంటాయి.

ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు.ఇక ఇప్పుడు ఆయన చిరంజీవితో( Chiranjeevi ) ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.మరి ఈ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుందనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.
మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం అయితే కాదు.కొంచెం తేడా కొట్టిన కూడా సినిమా డిజాస్టర్ ను మూట గట్టుకుంటుంది.

ఇక ఇప్పటికే వరుసగా 8 విజయాలను సాధించిన అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవితో చేయబోయే సినిమాతో తొమ్మిదో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.దానికోసమే ఇప్పుడు ఆ స్క్రిప్ట్ మీద కసరత్తులు చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా ఎమోషన్స్ ను కామెడీని బ్యాలెన్స్ గా చేస్తూ ముందుకు సాగే అనిల్ రావిపూడి సినిమాలు ప్రతి ప్రేక్షకుడిని మెప్పిస్తూ ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఆయన ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ జు సాధిస్తాడు అనేది…
.