2025 సంవత్సరంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన క్రేజీ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయనే సంగతి తెలిసిందే.ఐఎండీబీ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో సికిందర్( Sikandar Movie ) ఒకటి.
ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో సల్మాన్ హీరోగా తెరకెక్కిన సికిందర్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.ఈ సినిమా తర్వాత జాబితాలో యశ్ టాక్సిక్( Toxic Movie ) ఉంది.
కేజీఎఫ్2 సినిమా తర్వాత యశ్ కొంతకాలం గ్యాప్ తీసుకుని నటించిన ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.రజనీకాంత్ కూలీ,( Coolie ) అక్షయ్ హౌస్ ఫుల్5, టైగర్ ష్రాఫ్ బాఘీ4, ప్రభాస్ ది రాజాసాబ్,( The Rajasaab ) హృతిక్ ఎన్టీఆర్ వార్2,( War 2 ) మోహన్ లాల్ ఎ2 : ఎంపురాన్, షాహిద్ కపూర్ దేవ, విక్కీ కౌశల్ ఛావా సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
మంచు విష్ణు కన్నప్ప,( Kannappa ) సూర్య రెట్రో,( Suriya Retro ) కమల్ థగ్ లైఫ్, అక్షయ్ స్కై ఫోర్స్, కాంతారా : ది లెజెండ్1, థామ, అల్ఫా, సితారే జమీన్ పర్, జాట్ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయనున్నాయో చూడాల్సి ఉంది.ఈ సినిమాలన్నీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.
టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ను 2025 సంవత్సరం మరింత పెంచే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ సంవత్సరం ఏ రేంజ్ లో కలిసొస్తుందో చూడాల్సి ఉంది.టాలీవుడ్ సినిమాలు రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తాయో లేదో తెలియాల్సి ఉంది.
ది రాజాసాబ్, వార్2, కన్నప్ప సినిమాల కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు సైతం ఒకింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.