కనుమ పండుగ పూట తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు( KTR ) బిగ్ షాక్ తగిలింది.ఫార్ములా ఈ-రేసు( Formula E-Race ) కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో SLP ( Special Leave Petition ) వేశారు.
అయితే ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు( Supreme Court ) ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది.ఇందులో భాగంగా జస్టిస్ బేలా ఎం.త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విషయమై హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి తాము ఇష్టపడటం లేదని స్పష్టం చేసింది.దీంతో కేటీఆర్ తరపున పెట్టిన క్వాష్ పిటిషన్‌ను ఆయన వెనక్కు తీసుకున్నారు.
ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం కేటీఆర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఎదుట హాజరుకానున్నారు.గురువారం ఆయన విచారణకు హాజరు అవుతారని సమాచారం.

ఇక కేటీఆర్ తరపున అడ్వొకేట్ సుందరం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాదనలు కొన్ని వినిపించారు.ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతోనే రూపొందించబడిందని, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు.ఇది ఒక ప్రభుత్వ ప్రాజెక్టు. డబ్బు తీసుకున్న వ్యక్తులు, హెచ్‌ఎమ్‌డిఏ (HMDA) వంటి ఇతర సంబంధిత సంస్థలను నిందితులుగా చేర్చలేదని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రొహత్గి కూడా ఆయన వాదనలు వినిపించారు.ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలని కోర్టును అభ్యర్థించారు.
గవర్నర్ కూడా ఈ దర్యాప్తుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఇక ఈ ఫార్ములా ఈ-రేసు కేసులో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంది.ఈ కేసు నుంచి తప్పించుకోవాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది.
మొత్తానికి సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో ఈ కేసులో కేటీఆర్‌కు తీవ్రంగా ఎదురుదెబ్బ తగిలింది.ఫార్ములా ఈ-రేసు కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగనుంది.
ప్రస్తుతం ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.