మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.మెగా ఫాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఇప్పటి నుండే ప్రయత్నాలు జరుగుతున్నాయి.సంక్రాంతి కి ఈ సినిమా తో పాటు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి కూడా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
ఈ రెండు సినిమా లు నువ్వా నేనా అన్నట్లుగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి.మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ నేపథ్యం లో చాలా ఏరియాల్లో వాల్తేరు వీరయ్య భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
తాజాగా ఓవర్సీస్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ సమాచారం అందింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమా కు గాను యూఎస్ బయ్యర్లు ఏడు కోట్ల రూపాయలను చెల్లించాలని తెలుస్తోంది.అంతే కాకుండా నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాకు గాను 3.8 కోట్ల రూపాయలను చెల్లించారట.ఆసక్తికర విషయం ఏంటంటే.ఈ రెండు సినిమా లను ఒకే డిస్ట్రిబ్యూటర్ యూ ఎస్ లో విడుదల చేయబోతున్నాడట.సాధ్యమైనన్ని ఎక్కువ స్క్రీన్స్ లో ఈ రెండు సినిమా లను స్క్రీనింగ్ చేయబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడట.ఈ రెండు సినిమా లతో పాటు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన వారసుడు సినిమా ను కూడా సంక్రాంతి కి విడుదల చేయబోతున్నారు.
దాన్ని కూడా అమెరికా లో భారీ ఎత్తున విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడు.అందుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఈ సారి సంక్రాంతికి రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.