ఈ మధ్యకాలంలో చాలామంది వయసు తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఒకరి నుండి ముగ్గురి వరకు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.ఇక కొంతమందికైతే మోకాళ్ళ మార్పిడి చేసి ఐరన్ రాడ్లను ఉంచి కూడా చికిత్స చేస్తున్నారు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ రావడానికి కారణం వారి శరీర అధిక బరువు పెరగడం, వెస్ట్రన్ స్టైల్ ఫ్లోర్లపై నడవడం, ఎక్కువసేపు నిలబడి వంట చేయడం లాంటి సమస్యల వలన మోకాళ్ళు తొందరగా అరుగుతూ ఉంటాయి.
ఇది క్రమక్రమంగా పెరిగి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అయి చివరికి మోకాళ్ళ మార్పిడి వరకు వస్తుంది.అలా రాకుండా మోకాళ్ళ నొప్పి( Knee pain ) వచ్చిన మొదట్లోనే ఈ ఒక్క నూనెతో రోజు మర్దన చేసుకోవడం వలన నొప్పిని పరార్ చేసుకోవచ్చు.
మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే ఈ నూనెను తెచ్చుకోవాల్సిందే.అయితే ఈ నూనె ఎలా రాసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.దీనికోసం ముందుగా నువ్వుల నూనె( Sesame oil ) తీసుకొని అందులో మూడు నుండి నాలుగు యూకలిప్టస్ ( Eucalyptus )ఆకులను వేసి స్టవ్ పై ఉంచి బాగా మరిగించాలి.ఆ తర్వాత అందులో వచ్చిన నేను ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి.
ఇక ఆ ఆయిల్ ను మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు పొద్దున, సాయంత్రం మోకాళ్ళకు తరచూ మర్దన చేయాలి.ఆ తర్వాత వేడి నీళ్లతో కాపడం పెట్టాలి.ఇలా రోజు చేయడం వలన వారం రోజుల్లో నొప్పికి ఉపశమనం లభిస్తుంది.
యూకలిప్టస్ ఆకుల్లో ఉన్న ఫిలోలిక్ యాసిడ్ నరాల నుండి నొప్పి లోపలికి పోకుండా అడ్డుకొని నొప్పి తీవ్రతను తగ్గించడమే కాకుండా కండరాలు బలంగా తయారవ్వడానికి కూడా సహాయపడుతుంది.అలాగే నువ్వుల నూనె ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.దీంతోపాటు మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా గురుకులం లేదా గడ్డి పోచల పైన అరగంట నుండి గంటసేపు నడవడం, అధిక బరువును ( Overweight )తగ్గించుకోవడం, ఎక్కువసేపు నిలబడకుండా ఉండడం, 10 నిమిషాల కన్నా ఎక్కువ కూర్చొని మళ్లీ నిలబడడం లాంటి జాగ్రత్తలు పాటించి, కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకుంటే వెంటనే మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.