నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna ) అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో మూడు హిట్స్ అందుకుని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.హ్యాట్రిక్ అందుకున్నాడు అంటే మాములు విషయం కాదు.
అఖండ తర్వాత బాలయ్య లక్ మారిపోయింది అనే చెప్పాలి.ఏ సినిమా చేసిన సూపర్ హిట్ అనిపించుకుంటుంది.
ఇలా హ్యాట్రిక్ విజయాల తర్వాత ప్రజెంట్ బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ ( Director Bobby ) దర్శకత్వంలో ఒక సినిమాకు ( NBK109 ) కమిట్ అయ్యాడు.బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూట్ స్టార్ట్ చేసుకుంది.
ఇక ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఏదొక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.

మరి తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉన్నట్టు తెలుస్తుంది.మరి ఈ సాంగ్ కోసం తమన్నాను తీసుకున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
కానీ ఇప్పుడు ఆ సాంగ్ కోసం డింపుల్ హయతిని (Dimple Hayathi) ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది.

జర్ర జర్ర వంటి సాంగ్ తో ఊపేసిన ఈ బ్యూటీ నందమూరి హీరోతో కాలు కదిపితే పూనకాలు గ్యారెంటీ అనే చెప్పాలి.మరి ఇందులో నిజమెంత ఉందో చూడాలి.ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా నిర్మాతలుగా నాగ వంశీ( Nagavamshi ) త్రివిక్రమ్ భార్య సౌజన్య( Sowjanya ) వ్యవహరించ బోతున్నారు.
థమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.







