నయనతారలో( Nayantara ) అప్పుడు ఎంత మార్పు వచ్చింది అంటున్నారు ఆమె అభిమానులు.నయన్ పేరు చెబితే చాలు నిర్మాతలు, దర్శకులు మరియు హీరోలు ఖచ్చితంగా భయపడతారు.
ఎందుకంటే ఆమె సినిమాకు ఒప్పుకుంది అంటే ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కి రాదు ఎక్కడా కూడా సినిమా గురించి మాట్లాడదు డబ్బులు తీసుకున్నామా నటించి వెళ్ళిపోయామా అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది అందుకే ఆమె సినిమాకి వర్క్ అవుతుందేమో కానీ కలెక్షన్స్ కి మాత్రం ఎలాంటి ప్లస్ అవదు అనేది నిర్మాతల వాదన.ఈ ఒక్క కారణం మినహాయిస్తే నయన్ విషయంలో ఎలాంటి బాధ ఉండదు కానీ ఇదొక్కటే అసలు బాధ.

ఇక ఈ మధ్యకాలంలో ఆమె బాలీవుడ్( Bollywood ) లో కూడా అడుగుపెట్టింది.షారుక్ సరసన జవాన్ చిత్రంలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.టాలీవుడ్ అయిన, తర్వాత కోలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ప్రమోషన్స్ అంటే కుదరనే కుదరదని తప్పించుకుంటుంది.చివరికి జవాన్ సినిమా కోసం ఆమె ఎలాంటి ప్రమోషన్ ప్రోగ్రాం లో కూడా పాల్గొనలేదు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు.
జవాన్( Jawan ) చిత్రాన్ని చూడమని కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేదు.కానీ ఇప్పుడు ఎందుకు నయన్ లో బాగా మార్పు వచ్చినట్టుగా తెలుస్తుంది.

ఎమోషన్స్ కి మాత్రమే కాదు ఆమె ఫోటో షూట్ చేసింది కూడా ఎవరికి తెలియదు.ఏ సందర్భంలో కూడా ఆమె ఫోటో షూట్ చేసి తన సోషల్ మీడియా అకౌంట్లో అప్లోడ్ చేసింది కూడా లేదు.కానీ తాజాగా బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు మాత్రం ఫోటో షూట్ చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది.మరి బాలీవుడ్ ఆఫర్స్ వస్తాయో రావో తెలియదు కానీ నయన్ లో వచ్చిన మార్పు కి అందరూ ఖుషి అవుతున్నారు.
ఇదే విధంగా ప్రమోషన్స్ కి కూడా వచ్చి నిర్మాతకు లాభాలు పండిస్తే బాగుంటుంది అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు మరి నయన్ ఈ కామెంట్స్ కి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.