ఏపీ పీసీసీ చీఫ్ (AP PCC Chief) గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల (YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ పాలనలో అభివృద్ధి (Development) జరగలేదని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన నాటికి అప్పు రూ.లక్ష కోట్లని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.చంద్రబాబు పాలన (Chandra Babu Governance)లో రూ.2 లక్షల కోట్ల అప్పులు చేశారన్న ఆమె సీఎం జగన్ (CM Jagan) రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని తెలిపారు.
ఇప్పుడు ఏపీకి ఆరున్నర లక్షల కోట్ల అప్పులున్నాయన్నారు.కార్పొరేషన్ల లోన్లు కూడా కలుపుకుంటే ఏపీపై రూ.10 లక్షల కోట్ల భారం ఉందని చెప్పారు.ఏపీ రాజధాని (AP Capital)ని నిర్మించారా అని ప్రశ్నించారు.అమరావతిని సింగపూర్ చేస్తానని చంద్రబాబు త్రీడీ గ్రాఫిక్స్ చూపించారన్న షర్మిల ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు, జగనే కారణమని ఆరోపించారు.