ఆలివ్ ఆయిల్.దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
ఈ ఆలివ్ ఆయిల్‌లో విటమిన్ ఎ, విటమిన్ కె, ఒమెగా 6, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, సాచ్యురెటెడ్ ఫ్యాట్స్, మోనో సాచ్యురెటెడ్ ఫ్యాట్స్ మరియు ఇతర పోషకాలు కూడా ఎన్నో ఉన్నాయి.అందుకే ఇటీవల కాలంలో చాలా మంది ఆలివ్ ఆయిల్‌ను ఆరోగ్యానికి మంచిదని వంటలకు ఉపయోగిస్తున్నాయి.
అలాగే సౌందర్య సాధనలోనూ ఆలివ్ ఆయిల్‌ను యూజ్ చేసే వారు ఎందరో.అయితే చర్మానికి ఆలివ్ ఆయిల్ మంచిదే.
అయినప్పటికీ కొందరి చర్మానికి మాత్రం ఆలివ్ ఆయిల్ అస్సలు పడదు.
ముఖ్యంలో జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్) ఉన్న వాళ్లు ఆలివ్ ఆయిల్ వాడకపోవడమే చాలా మంచిదని బ్యూటీషన్లు సూచిస్తున్నారు.
ఎందుకూ అంటే.ఆయిలీ స్కిన్ వారు ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువట.
ఇలాంటి వారు ఆలివ్ ఆయిల్‌ను అప్లై చేస్తే.అదొక లేయర్‌లా ఏర్పడి దుమ్ము, ధూళిని చర్మంపై పేరుకుపోయేలా చేస్తుంది.
ఫలితంగా, పింపుల్స్, బ్లాక్ హెడ్స్‌తో పాటుగా ఇతర చర్మ సమస్యలు వస్తాయి.
పొడి చర్మ తత్వం కలిగిన వారు ఆలివ్ నూనెను యూజ్ చేయవచ్చు.కానీ, అతిగా ఉపయోగిస్తే మాత్రం చర్మంపై ఉండే సహజ మాయిశ్చరైజర్‌ను ఆలివ్ ఆయిల్ తొలిగించేస్తుంది.అలాగే తామర మరియు సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు ఉన్న వారు కూడా ఆలివ్ ఆయిల్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఎందుకంటే, ఆలివ్ ఆయిల్ ఇలాంటి చర్మ సమస్యలను మరింత రెట్టింపు చేస్తుంది.
ఇక చిన్న పిల్లలకి కొందరు ఆలివ్ ఆయిల్ రాస్తుంటారు.
కానీ, ఇలా చేయడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు.ఎందుకంటే, చిన్నారుల చర్మతత్వం ఎలా ఉంటుందో తెలియదు.
అందువల్ల, వారికి ఆలివ్ ఆయిల్ రాస్తే.అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే పెద్దలు ఆలివ్ ఆయిల్ చర్మానికి అప్లై చేసినప్పుడు మంట లేదా రాషెస్ వస్తే వెంటనే దాన్ని యూజ్ చేయడం మానేయాలి.లేదంటే చర్మంపై రియాక్షన్ చూపిస్తుంది.