ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Icon Star Allu Arjun ) తన సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది.పుష్ప ది రైజ్ మూవీ అల్లు అర్జున్ ఇమేజ్ ను ఎన్నో రెట్లు పెంచింది.
పుష్ప ది రైజ్ సీక్వెల్ కోసం బన్నీ అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే తన రెమ్యునరేషన్ తో బన్నీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీకి బన్నీ ఏకంగా 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.రెమ్యునరేషన్( Allu Arjun Remuneration ) విషయంలో ఇది సరికొత్త రికార్డ్ అనే చెప్పాలి.
ఫోర్బ్స్ ఇండియా రెమ్యునరేషన్ కు సంబంధించి టాప్ 10 నటీనటుల జాబితాను రిలీజ్ చేయగా ఈ జాబితా ద్వారా ఈ విషయం వెల్లడైంది.స్టార్ హీరో విజయ్( Vijay ) ది గోట్, లియో సినిమాల కోసం 275 కోట్ల రూపాయలు ఛార్జ్ చేసినట్టు వెల్లడైంది.
![Telugu Allu Arjun, Forbes India, Pushpa, Pushpa Rule, Rajinikanth, Shahrukh Khan Telugu Allu Arjun, Forbes India, Pushpa, Pushpa Rule, Rajinikanth, Shahrukh Khan](https://telugustop.com/wp-content/uploads/2024/11/allu-arjun-created-new-record-with-remuneration-detailss.jpg)
షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) ఢంకీ సినిమా కోసం 250 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకున్నారని తెలుస్తోంది.రజనీకాంత్( Rajinikanth ) రెమ్యునరేషన్ 150 కోట్ల రూపాయలు కాగా అమీర్ ఖాన్( Aamir Khan ) పారితోషికం 100 కోట్లు, ప్రభాస్ ( Prabhas ) 100 కోట్లు, కమల్ హాసన్ 100 కోట్లు, అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ 60 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.స్టార్స్ పారితోషికాలు గత కొన్నేళ్లలో అమాంతం పెరిగాయని చెప్పవచ్చు.
![Telugu Allu Arjun, Forbes India, Pushpa, Pushpa Rule, Rajinikanth, Shahrukh Khan Telugu Allu Arjun, Forbes India, Pushpa, Pushpa Rule, Rajinikanth, Shahrukh Khan](https://telugustop.com/wp-content/uploads/2024/11/allu-arjun-created-new-record-with-remuneration-detailsa.jpg)
పుష్ప2 సినిమా నుంచి తాజాగా విడుదలైన కిస్సిక్ సాంగ్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.కిస్సిక్ సాంగ్ కోసం శ్రీలీల ఏకంగా 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది.ఏకంగా ఆరు భాషల్లో పుష్ప2 మూవీ విడుదల కానుండగా ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
అల్లు అర్జున్ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందేమో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.