అవును మీరు విన్నది నిజమే… హైదరాబాదు రోడ్లు( Hyderabad Roads ) ఎరుపెక్కాయి.దానితో స్థానిక జనాలు భయాందోళనలకు గురయ్యారు.
సోమవారం రాత్రి హైదరాబాద్ రోడ్డుపై ఎరుపు రంగు కలిసిన నీరు( Red Color Water ) వరదలాగా పోటెత్తడంతో జనాలు పరుగులు తీశారు.అంతేకాకుండా స్థానికంగా నివాసం ఉంటున్న వృద్ధులు, చిన్నపిల్లల వంటి వారు ఆ ఎరుపు రంగు నీటి నుండి వెలువడిన దారుణమైన వాసనని పేల్చలేక, ముక్కు మూసుకోలేక నానా తంటాలు పడ్డారు.
దాంతో ఈ విషయం కాస్త జిహెచ్ఎంసి( GHMC ) అధికారులు దాకా వెళ్ళింది.విషయంలోకి వెళితే, ఈ సోమవారం నాడు రాత్రి సమయంలో, అంటే సరిగా 12 దాటిన తర్వాత జీడిమెట్ల( Jeedimetla ) పరిసర ప్రాంతంలో ఒక్కసారిగా రోడ్లు ఎరుపు రంగు నీటితో నిండిపోయాయి.
![Telugu Balanagar, Chemical, Ghmc, Hyderabad, Hyderabadred, Jeedimetla, Roads Red Telugu Balanagar, Chemical, Ghmc, Hyderabad, Hyderabadred, Jeedimetla, Roads Red](https://telugustop.com/wp-content/uploads/2024/11/roads-turn-red-in-hyderabad-jeedimetla-area-viral-detailss.jpg)
సుభాష్ నగర్, వెంకటాద్రి నగర్ వంటి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.అకస్మాత్తుగా అక్కడ మ్యాన్ హోల్స్ నుండి దుర్గంధంతో కూడుకున్న ఎరుపు రంగు నీరు బయటికి రావడంతో రోడ్లంతా జలమయం అయ్యాయి.దానిని చూసిన స్థానికులు కంగారు పడుతూ పరుగులు తీశారు.ఇక ఆ వాసనని భరించలేని జనాలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.వృద్ధులు, చిన్నపిల్లల వంటి వారు ఊపిరి తీసుకోవడంలో కూడా సమస్యలు ఎదుర్కొన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.దీనిపై స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వగా ప్రస్తుతం దీనిపైన దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
![Telugu Balanagar, Chemical, Ghmc, Hyderabad, Hyderabadred, Jeedimetla, Roads Red Telugu Balanagar, Chemical, Ghmc, Hyderabad, Hyderabadred, Jeedimetla, Roads Red](https://telugustop.com/wp-content/uploads/2024/11/roads-turn-red-in-hyderabad-jeedimetla-area-viral-detailsa.jpg)
జీడిమెట్ల, బాలనగర్ వంటి ఏరియాలో ఎక్కువగా ఫార్మసూటికల్స్ కంపెనీలు కొలువు తీరడంతో ఈ పరిస్థితి తలెత్తునట్టు సమాచారం.ఒకప్పుడు సిటీకి దూరంగా ఉన్న ఈ ఏరియాలో ఇప్పుడు జనాలు ఎక్కువగా నివసించడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు స్థానికులు పలు మీడియాల ద్వారా తమ గోడుని విన్నవించుకుంటున్నారు.సదరు కంపెనీలలో రసాయన పదార్థాలు ఎక్కువగా వినియోగించడం వలన ఈ పరిస్థితి తలెత్తుతుంది.ఈ సందర్భంగా కొంతమంది యువతీ యువకులు ఇలాంటి పరిశ్రమలను బ్యాన్ చేయాలని, అసలు పర్మిషన్స్ వంటివి ఇవ్వకూడదని చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా ఇటువంటి వాటిపై చర్యలు తీసుకొని, త్వరితగతిన అక్కడ స్థానికులకు న్యాయం చేకూరేలా చేయాలని డిమాండ్లు చేస్తున్నారు.